|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్యను అలా కూడా పిలుస్తారు.. ఇంత సీరియస్‌గా ఏ సినిమా రాలేదు.. నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

Published: 20-08-2025, 4:31 PM
నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్యను అలా కూడా పిలుస్తారు.. ఇంత సీరియస్‌గా ఏ సినిమా రాలేదు.. నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

విజయ రామరాజు నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా ఆగస్టు 29న విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాత శ్రీని గుబ్బల, సినిమా తయారీ అనుభవాలను, నల్గొండ కబడ్డీ ఆటగాడు నాగులయ్య జీవితంపై ఆధారంగా ఈ సినిమాను ఎలా తెరకెక్కించారో వివరించారు.

Key Points

1

అర్జున్ చక్రవర్తి సినిమా ఆగస్టు 29న విడుదల

2

46 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న చిత్రం

4

సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సీరియస్‌ కథ

అర్జున్ చక్రవర్తి సినిమా విడుదల తేదీ

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.

ఇటివలే రీలీజైన అర్జున్ చక్రవర్తి టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ చక్రవర్తి సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్లు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీపై ఆసక్తి ఉంది. మేం సాఫ్ట్‌వేర్‌లో కూడా క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. క్రియేటివిటీ మీద ఇష్టం డెవలప్ అవుతూ అలా సినిమాల్లోకి రావడం జరిగింది.

సినిమా ప్రత్యేకతలు

-మా కజిన్ ద్వారా డైరెక్టర్ విక్రాంత్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ చాలా నచ్చింది. ఒక ఆరు నెలలు ట్రావెల్ అయిన తర్వాత ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలనుకుని నిర్ణయించుకున్నాం. డైరెక్టర్‌కి క్రియేటివ్ సైడ్ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం.

– క్రియేటివ్‌ గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటివరకు కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరియస్‌గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని ఛాలెంజ్‌గా తీసుకుని సినిమా చేశాం.

-నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్. ఆయన జీవితంలో ట్రూ ఈవెంట్స్ 60%, 40% ఫిక్షన్‌తో ఈ కథని చేయడం జరిగింది. సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది.

నిర్మాత శ్రీని గుబ్బల అనుభవాలు

చాలా బాగుందండి. నార్త్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. హను రాఘవపూడి గారు టీజర్ ఆన్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగుందని చెప్పారు.

-విక్రమ్ వేద కి సౌండ్ ఇంజనీర్ గా చేసిన విఘ్నేష్ బాస్కరన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

-ఏదైనా స్పోర్ట్స్ లేదా ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఉంది. ఏం చేసినా పక్క కమర్షియల్ సెన్సిబిలిటీతోనే చేస్తాం.

చివరగా, అర్జున్ చక్రవర్తి సినిమా ఒక కొత్త ప్రయత్నంగా నిలుస్తుందని, కబడ్డీ నేపథ్యంలో ఇంత సీరియస్‌గా సినిమా రాలేదని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.