|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగబంధం: అనంత పద్మనాభ స్వామి ట్రెజర్ హంట్! టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 02-02-2026, 10:35 AM
నాగబంధం: అనంత పద్మనాభ స్వామి ట్రెజర్ హంట్! టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లతో ‘నాగబంధం’ మూవీ!
  • అనంత పద్మనాభ స్వామి దేవాలయం రహస్యాల ఆధారంగా చిత్రం
  • మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న టీజర్ రిలీజ్!
  • తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘నాగబంధం’!

టాలీవుడ్ లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ‘నాగబంధం’ మూవీ వస్తోంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 15న విడుదల కానుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అనంత పద్మనాభ స్వామి ట్రెజర్ సీక్రెట్స్!

చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్రైమ్, హారర్, డివోషనల్ సస్పెన్స్ , మిస్టరీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. చాలా రోజులుగా హిట్ కోసం ప్రయత్నించిన ఆది కూడా ఇలా డిఫరెంట్ సినిమాతో సక్సెస్ అయ్యారు. అయితే అందులో భాగంగానే ఇప్పుడు నాగబంధం ( Nagabandham ) అనే కొత్త టైటిల్ తో సినిమా వస్తోంది.

ఫిబ్రవరి 15న టీజర్ విడుదల!

విరాట్ కర్ణ ( (Virat Karna)), నవ నటేష్ ( nabha natesh ), ఐశ్వర్య మీనన్ ( ishwarya menon) ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఈ నాగబంధం. ట్యాగ్ లైన్ ది సీక్రెట్ ట్రెజర్. ఈ మూవీలో మురళీ శర్మతోపాటు జగపతి బాబు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి, పురాతన భారతీయ దేవాలయాలలో రహస్య నిధుల చుట్టూ జరిగే యదార్థాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ రహస్య నిధుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను పానీ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం.

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్స్!

ఈ నాగబంధం ( Nagabandham ) సినిమాకు అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తుండగా, నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవిలో మలయాళం, తెలుగు తమిళం కన్నడ అలాగే హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. దీనికి తగ్గట్టుగానే నాగుపాముతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. మ‌రి ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఎలా ఆదిరిస్తారో చూడాలి.

నాగబంధం మూవీ టీజర్ ఫిబ్రవరి 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.