|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగ‌ర్జున 100వ సినిమాపై రాజ‌కీయాలు…ఇక థియేట‌ర్ల‌లో ర‌చ్చ, ర‌చ్చే !

Published: 16-10-2025, 1:48 AM
నాగ‌ర్జున 100వ సినిమాపై రాజ‌కీయాలు...ఇక థియేట‌ర్ల‌లో ర‌చ్చ, ర‌చ్చే !

అక్కినేని నాగార్జున 100వ సినిమాపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదొక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనుండగా, నాగ చైతన్య, అఖిల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించబోతున్నారు. టబు కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Key Points

1

నాగార్జున 100వ సినిమా పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది.

2

ఇందులో సీఎం సీటు చుట్టూ కథ తిరుగుతుంది. నాగార్జున ద్విపాత్రాభినయం.

4

‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది; భారీ అంచనాలున్నాయి.

నాగార్జున 100వ సినిమా: ఒక రాజకీయ డ్రామా

దిశ‌, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున త్వరలో తన 100వ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే పనిలో నాగార్జున బిజీగా ఉన్నారట. ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ చేస్తున్నారు. నాగార్జున 100వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ప్రత్యేక పాత్రల‌లో కనిపించబోతున్నారట. అంతేకాదు హీరోయిన్ టబు ఇందులో నటించనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సీటు కోసం ఈ సినిమా స్టోరీ మొత్తం తిరుగుతుందట. అంతేకాదు ఇందులో అక్కినేని నాగార్జున రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీఎం పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు. త్వరలోనే ఫైనల్ కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ అనుకుంటున్నారట. అటు 27 సంవత్సరాల తర్వాత నాగార్జున సరసన టబు నటిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్ అంచనాలను పెంచేస్తున్నాయి.

ప్రధాన తారాగణం, ప్రత్యేక పాత్రలు

అంచనాలు పెంచుతున్న ‘కింగ్ 100’

నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’ టైటిల్‌తో రానుందని సమాచారం. రాజకీయ నేపథ్యం, బహుళ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.