|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలయ్యతో సినిమా అంటే నాగార్జునకు అంత భయమా? సంచలన వ్యాఖ్యలు వైరల్!

Published: 27-03-2026, 8:05 AM
షాకింగ్: బాలయ్యతో సినిమా అంటే నాగార్జునకు అంత భయమా? సంచలన వ్యాఖ్యలు వైరల్!
  • బాలయ్యతో గుండమ్మ కథ రీమేక్ అంటే భయమన్న నాగార్జున – దేవదాసు ఫలితమే కారణమా?
  • గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో తారక్, చైతూ నటించాల్సి ఉంది – ప్రాజెక్ట్ ఆగిపోయింది!
  • కృష్ణ నటించిన దేవదాసు ఫ్లాప్ కావడంతోనే నాగ్ వెనుకడుగు వేశారా?
  • బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలున్నాయా? అందుకే కలిసి నటించడం లేదా?

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. నాగార్జున, బాలకృష్ణ కలిసి సినిమా చేస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బాలయ్యతో సినిమాకు నో చెప్పిన నాగార్జున?

క్లాసిక్ సినిమాలకు రీమేక్స్ చేయాలని, సీక్వెల్స్ చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ క్లాసిక్ సినిమాలని టచ్ చేయకూడదు, వాటిని చెడగొట్టకూడదు అని భావించే వారు కూడా ఉంటారు. నాగార్జునకి కూడా ఇలాంటి సందిగ్ద పరిస్థితి ఎదురైంది. అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వారిద్దరూ కలసి నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి.

అలాంటి వాటిలో గుండమ్మ కథ ఒకటి. ఏఎన్నార్, ఎన్టీఆర్ లాగా మీరు, బాలకృష్ణ కలసి ఎందుకు నటించకూడదు అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకి ప్రశ్న ఎదురైంది. నాగార్జున బదులిస్తూ.. బాలయ్యతో నటించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. బాలయ్య, నేను తరచుగా మాట్లాడుకుంటుంటాం. మేమిద్దరం కలసి ఒక సినిమా చేయాలని చర్చ కూడా జరిగింది.

కృష్ణ ‘దేవదాసు’ ఫలితమే కారణమా?

ఆ మధ్యన బాలయ్య నాకు చుప్ కే చుప్ కే మూవీ సీడీ కూడా పంపించారు. ఒకసారి చూడు.. ఈ మూవీ మనిద్దరం కలసి చేసే బావుంటుంది అని చెప్పాడు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత దాని గురించి చర్చ రాలేదు. గుండమ్మ కథ సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య చేయాలని అనుకుంటున్నారు. నేను బాలయ్య కలసి చేద్దాం అంటే ధైర్యం సరిపోవడం లేదు.

కొన్ని క్లాసిక్ మూవీస్ ని టచ్ చేయకపోవడమే మంచింది. గుండమ్మ కథ ఎలాంటి సినిమానో తారక్, చైతూకి తెలియదు. దేవదాసు రీమేక్ ఏమైందో తెలుసు కదా అంటూ నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ మూవీపై సెటైర్లు వేశారు. ఏఎన్నార్ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలలో దేవదాసు ఒకటి. ఆ చిత్రాన్ని కృష్ణ రీమేక్ చేశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అదే విషయాన్ని నాగార్జున పరోక్షంగా ప్రస్తావించారు.

గుండమ్మ కథ రీమేక్ ఆగిపోవడానికి కారణమిదేనా?

అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున స్నేహంగా ఉండేవారు. కానీ కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. చైతు తారక్ గుండమ్మ కథ రీమేక్ లో నటిస్తున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు.

నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలకృష్ణతో సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.