|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagarjuna: 27 ఏళ్ల తర్వాత జోడీ సెట్ అయిందా?

Published: 09-10-2025, 2:43 AM
Nagarjuna: 27 ఏళ్ల తర్వాత జోడీ సెట్ అయిందా?

కింగ్ నాగార్జున 100వ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత టబుతో నాగార్జున మరోసారి జోడీ కట్టనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Key Points

1

నాగార్జున, టబు 27 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించే అవకాశం ఉంది.

2

గతంలో 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది.

4

టబు తెలుగులో 'అల వైకుంఠపురములో' తర్వాత మళ్లీ కనిపించనుంది.

నాగార్జున-టబు: 27 ఏళ్ల తర్వాత మళ్లీ?

నాగార్జున పేరు చెప్పగానే మన్మథుడు అనే ట్యాగ్ లైన్ గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 66 ఏళ్లు. అయినా సరే చాలామంది కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటారు. అప్పట్లో పెళ్లికి ముందు నాగ్ తో పలువురు హీరోయిన్ల విషయంలో రూమర్స్ కూడా వచ్చాయి. అలాంటి బ్యూటీల్లో టబు ఒకరు. ‘నిన్నే పెళ్లాడతా’లో అదిరిపోయే కెమిస్ట్రీ పండించిన ఈ జంట.. తర్వాత ఎందుకో కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు జోడీ సెట్ అయినట్లు కనిపిస్తుంది.

199‍5లో ‘సిసింద్రీ’ సినిమా కోసం తొలిసారి నాగార్జున, టబుతో కలిసి పనిచేశారు. ఇక తర్వాత ఏడాది అంటే 96లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ మూవీ.. వీళ్ల జోడికి ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో 98లో ‘ఆవిడ మా ఆవిడే’ అని ఓ చిత్రం చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు. దానికి తోడు వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ తర్వాత కాలంలో వీళ్లు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఓ మూవీ కోసం జంటగా నటించనున్నారనే టాక్ వినిపిస్తుంది.

నాగ్ 100వ చిత్రం: వివరాలు, ‘లాటరీ కింగ్’ టైటిల్

ఈ ఏడాది ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలు చేసిన నాగార్జున.. ఇప్పుడు హీరోగా తన 100వ చిత్రం చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ ఈ మూవీ తీస్తున్నాడు. ఈ సోమవారం హైదరాబాద్‌లో సింపుల్‌గా లాంచ్ కూడా జరిగింది. ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ ఈ చిత్రంలోనే నాగ్ సరసన టబు నటిస్తుందని, అంతా ఫైనల్ కూడా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు.

టబు ప్రస్తుత ప్రాజెక్టులు, తెలుగు రీ-ఎంట్రీ

టబు విషయానికొస్తే.. అప్పట్లో హీరోయిన్‌గా వరస సినిమాలు చేసింది. గత కొన్నాళ్ల నుంచి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు భాషల్లో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చేసింది. పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇప్పుడు నాగ్‌తో కాంబో ఫిక్స్ అయితే మాత్రం హైప్ రావడం గ్యారంటీనే.

నాగార్జున, టబు కాంబో నిజమైతే.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఇద్దరు స్టార్ నటులు ఇన్నేళ్లకు మళ్లీ జతకట్టడం సినీ ప్రియులకు ఓ గొప్ప ట్రీట్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.