|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

15 ఏళ్లుగా నాగార్జునను పట్టిపీడిస్తున్న సమస్య.. సర్జరీ లేకుండా ఎలా బయటపడ్డారంటే..!

Published: 16-12-2025, 11:04 PM
15 ఏళ్లుగా నాగార్జునను పట్టిపీడిస్తున్న సమస్య.. సర్జరీ లేకుండా ఎలా బయటపడ్డారంటే..!
  • 66 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపించే నాగార్జున.
  • 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడి.
  • మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీని పూర్తిగా నిరాకరించిన నాగార్జున.
  • ప్రత్యామ్నాయ పద్ధతులు (PRP, ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్) & రిహాబ్ తో చికిత్స.

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వయసులో తగ్గుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఇప్పటికీ యంగ్​గానే ఉన్నారు. అయితే, 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నానని తాజాగా ఆయన వెల్లడించారు. సర్జరీ లేకుండా ప్రత్యామ్నాయ చికిత్సలతో ఎలా ఆరోగ్యంగా ఉన్నారో తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

నాగార్జున ఫిట్నెస్ వెనుక దాగున్న వాస్తవం

Nagarjuna : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికి యంగ్ గా కనిపిస్తూ, పర్ఫెక్ట్ బాడీ, అందం, హెల్త్ మెయింటైన్ చేసేది ఎవరు అంటే నాగార్జున పేరే చెప్తారు అంతా. 66 ఏళ్ళు వచ్చినా ఇంకా మన్మధుడిలా కనిపిస్తారు నాగ్. నాగార్జున ఫిట్నెస్, హెల్త్, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. నాగార్జున ఫిట్నెస్, ఆయన అందంపై వేరే హీరోలు కూడా పొగుడుతారు.(Nagarjuna)

అయితే నాగార్జున కూడా ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారట. తాజాగా హెల్త్ కి సంబంధించిన ఓ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడగా తనకున్న సమస్య గురించి తెలిపారు.

15 ఏళ్లుగా మోకాలి నొప్పితో పోరాటం

నాగార్జున మాట్లాడుతూ.. 15 ఏళ్ళ క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పట్నుంచి మోకాలి నొప్పితో బాధపడ్డాను. నేను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదు. సర్జరీని అవాయిడ్ చేశాను. మోకాలు బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్ల్యూయిడ్స్ వాడాను, PRP చేసారు, మోకాలు లోపల రీ జనరేట్ అవ్వడానికి డాక్టర్స్ హెల్ప్ చేసారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా నేను గ్యాప్ ఇవ్వకుండా ప్రతి రోజు ఉదయం మోకాలి కోసం రిహాబ్ చేశాను. దాని మీద వర్క్ చేశాను. ఎప్పట్నుంచో ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు సర్జరీ వద్దు. సర్జరీ అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తాను అని తెలిపారు.

సర్జరీ లేకుండానే నాగార్జున ట్రీట్‌మెంట్

నాగార్జున మోకాలి నొప్పితో 15 ఏళ్లుగా పోరాడుతూ, సర్జరీ లేకుండానే కోలుకోవడం ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం. ఆయన ఆరోగ్య రహస్యం తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.