
📌 Key Points
- విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన ఫంకీ సినిమాపై మిశ్రమ స్పందన
- సినిమాపై వస్తున్న రివ్యూలపై స్పందించిన నిర్మాత నాగ వంశీ
- కామెడీ సినిమా అని ముందే చెప్పామని గుర్తు చేసిన నాగ వంశీ
- ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా సినిమా తీశామని వెల్లడి
విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా కె.వి అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఫంకీ సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాపై వస్తున్న రివ్యూలపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఫంకీ సినిమాపై మిశ్రమ స్పందన
Nagavamsi: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కయాదు లోహర్ జంటగా జాతి రత్నాలు దర్శకుడు కె.వి అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఫంకీ (Funky). ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందన లభించడమే కాకుండా కొంతమంది లాజిక్కులు మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా పట్ల వస్తున్నటువంటి స్పందన పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగ వంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తాను ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు అంటూ పదే పదే చెబుతూ వచ్చాను. ఈరోజు పొద్దున్నే కొంతమంది రివ్యూలు రాసేటప్పుడు సినిమాలో ఫ్లో లేదు, సినిమా అతుకులు అతుకులు ఉందంటూ రివ్యూ రాశారు. ఆ విషయాలన్ని సినిమా విడుదలకు ముందు నేనే చెప్పాను కదా మరి మీరు ఏదో సైంటిస్టులు లాగా ఈ విషయాలన్నీ కనుగొన్నట్టు మాట్లాడుతున్నారే అంటూ నాగ వంశి మాట్లాడారు.
రివ్యూలపై స్పందించిన నాగ వంశీ
నేను మీడియా గురించి మాట్లాడలేదు ట్విట్టర్ రివ్యూల గురించి మాట్లాడుతున్నాను. నేను కామెడీగా సిల్లీ ఫిలిం చేశాను. నేనేమైనా సాగర సంగమం సినిమా చేశానని చెప్పానా? లేదే.. అనుదీప్ స్టైల్ లోనే సినిమా చేసాము అంటూ ఈ సినిమా గురించి వచ్చిన రివ్యూలపై నాగ వంశి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో నాగ వంశీ , దిల్ రాజు ,హరీష్ శంకర్ వంటి వారు కూడా తలుక్కుమన్న సంగతి తెలిసిందే.
మీ డబ్బులకు న్యాయం చేస్తాం…
కామెడీ కోసమే సినిమా అంటున్న నిర్మాత
ఇలా ఈ సినిమా సిల్లీగా ఉండబోతుందని కామెడీ సినిమా చేశామంటూ తాను ముందు నుంచి చెబుతున్న విధంగానే ఈ సినిమా కూడా ఉంది అలాగే సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకుని రావద్దు అంటుంది నాగ వంశీ చెప్పిన విధంగానే సినిమా ఉంది. మీరు ఈ సినిమా కోసం పెట్టిన 150 రూపాయలకు కచ్చితంగా న్యాయం చేస్తామని, ఆడియన్స్ను నవ్వించడం కోసమే ఈ సినిమా చేసామని కచ్చితంగా వారిని నవ్విస్తామని నాగవంశీ తెలిపారు. ఇక ఈ ఏడాది నాగ వంశీ నిర్మాణంలో ఈ సినిమా రెండో సినిమా కావటం విశేషం. గత ఏడాది పలువురు స్టార్ హీరోలతో సినిమా చేసిన పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొన్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఫంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు.
నాగ వంశీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కోసం పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.


