|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి స్నేహితుడితో ఘాడ ప్రేమ… స్టార్ హీరోయిన్ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా?

Published: 17-12-2025, 2:04 AM
చిరంజీవి స్నేహితుడితో ఘాడ ప్రేమ... స్టార్ హీరోయిన్ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా?
  • శరత్‌కుమార్, చిరంజీవికి మంచి స్నేహితులు.
  • శరత్‌కుమార్, నగ్మా ఘాడమైన ప్రేమలో మునిగిపోయారు.
  • నగ్మాతో ప్రేమ వల్ల శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయాతో విడిపోయారు.
  • శరత్‌కుమార్ రాధికను పెళ్లి చేసుకోగా, నగ్మా ఒంటరిగానే మిగిలిపోయింది.

చిరంజీవి స్నేహితుడైన నటుడు శరత్‌కుమార్, స్టార్ హీరోయిన్ నగ్మా ప్రేమాయణం అప్పట్లో సంచలనం. ఈ సంబంధం శరత్‌కుమార్ మొదటి వివాహంలో సమస్యలు తెచ్చింది. ఆయన విడిపోయి రాధికను పెళ్లాడగా, నగ్మా మాత్రం 50 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ ఒంటరిగానే ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవి స్నేహితుడు శరత్‌కుమార్ ప్రేమాయణం

చిరంజీవికి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిరంజీవితో మంచి అనుబంధం కలిగిన తమిళ నటుల్లో శరత్ కుమార్ పేరు ప్రధానంగా చెప్పాలి. శరత్ కుమార్, చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉంది. తాను సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నారని శరత్ కుమార్ పలు సందర్భాల్లో తెలిపారు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో శరత్ కుమార్, చిరంజీవి కలిసి నటించారు.

శరత్ కుమార్ సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. శరత్ కుమార్ నటుడిగా రాణిస్తున్న 90వ దశకంలో ఒక స్టార్ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు 90 వ దశకంలో స్టార్ గా వెలుగు వెలిగిన నగ్మా. ఆమెతో శరత్ కుమార్ ఘాడమైన ప్రేమలో మునిగిపోయారు. దీని గురించి నందం హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు.

నగ్మా వల్ల శరత్‌కుమార్ కుటుంబంలో సమస్యలు

శరత్ కుమార్ కి 1984లోనే ఛాయాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వారిలో ఒకరు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం నటిగా రాణిస్తున్నారు. శరత్ కుమార్, నగ్మాతో ప్రేమలో పడడంతో ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చాయి అని నందం హరిశ్చంద్ర రావు అన్నారు. శరత్ కుమార్ కి ఛాయా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా శరత్ కుమార్.. నగ్మాని దూరం పెట్టలేదు. దీనితో ఆమె భరించలేక శరత్ కుమార్ నుంచి విడిపోవాలని డిసైడ్ అయ్యారు.

ఆ విధంగా వీరిద్దరూ 2000 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. తనకు భర్త అవసరం లేదని, పిల్లలు చాలని ఛాయా నిర్ణయించుకున్నారు. తన వల్ల శరత్ కుమార్ ఫ్యామిలిలో సమస్యలు వచ్చాయని నగ్మా కూడా అతడికి దూరం జరిగారు. ఆ తర్వాత శరత్ కుమార్, రాధికాతో కొన్ని సినిమాల్లో నటించారు. అప్పటికి ఆమె కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఉన్నారు.

శరత్‌కుమార్ పెళ్లి, నగ్మా ఒంటరి జీవితం

శరత్ కుమార్ కి రాధికా ఓ సినిమా విషయంలో సాయం కూడా చేశారట. ఆ విధంగా శరత్ కుమార్, రాధిక మధ్య అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ నగ్మా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. 50 ఏళ్ళ వయసొచ్చినా కూడా నగ్మా వివాహం చేసుకోలేదు.

శరత్‌కుమార్, నగ్మా ప్రేమకథలో శరత్‌కుమార్ రాధికతో స్థిరపడగా, నగ్మా మాత్రం ప్రేమలో ఎదురైన నిరాశతో ఎవరినీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె వ్యక్తిగత జీవితం సినీ వర్గాల్లో నేటికీ చర్చనీయాంశంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.