|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నమ్రత అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? అదే జరిగి ఉంటే మహేష్‌బాబు ఎప్పటికీ దొరికేవాడు కాదేమో

Published: 05-08-2025, 8:13 AM
నమ్రత అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? అదే జరిగి ఉంటే మహేష్‌బాబు ఎప్పటికీ దొరికేవాడు కాదేమో

మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ ప్రేమ కథ చాలా మందికి తెలుసు. కానీ నమ్రత యొక్క అసలు కల ఏమిటో, అది నెరవేరి ఉంటే ఏమై ఉండేదో తెలుసుకుందాం.

Key Points

1

నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియాగా నిలిచారు.

2

ఆమె 'వంశీ' సినిమా ద్వారా మహేష్ బాబును కలిశారు.

4

అమ్మ వల్ల ఆమె డ్రీమ్‌ను వదులుకుంది.

నమ్రత యొక్క మిస్ ఇండియా విజయం

మహేష్‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `వంశీ` సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న నమ్రత.. `వంశీ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బి గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2000లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. కానీ ఈ చిత్రం రెండు మనసులను కలిపింది. హీరో హీరోయిన్లని ఓ ఇంటివారిని చేసింది. అలా `వంశీ` మూవీ మహేష్‌ బాబు, నమ్రత జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెప్పొచ్చు.

అయితే నమ్రత సినిమాల్లోకి ఎంట్రీకి ముందు మోడలింగ్‌ చేసింది. కాలేజీ రోజుల్లోనే ఆమె మోడలింగ్ చేసి ఏకంగా 1993లో మిస్‌ ఇండియా విజేతగా నిలిచింది. అలాగే మిస్‌ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. మొదట `జబ్‌ ప్యార్‌ కిసిసే హోతా హై` చిత్రంతో నటిగా మారింది. ఇందులో ఓ కీ రోల్‌ చేసింది. `మేరే దో అన్మోల్‌ రతన్‌` సినిమాతో హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసగా మూవీలో నటిస్తూ స్టార్‌ గా ఎదిగింది. అప్పట్లో నమ్రత బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఈ క్రమంలోనే ఆమెకి తెలుగులో `వంశీ`లో నటించే ఛాన్స్ వచ్చింది.

‘వంశీ’ సినిమా మరియు మహేష్ బాబుతో ప్రేమ

అయితే నమ్రత అసలు డ్రీమ్‌ సినిమా కాదు. ఆమె ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనుకుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేసిందట. కానీ వాళ్ల అమ్మ బెదిరించిందట. అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. దీంతో ఆ ఫీల్డ్ వద్దు, దాన్ని విరమించుకో అని హెచ్చరించిందట నమ్రత అమ్మ. అప్పటికీ తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో నమ్రత లేదు. దీంతో చేసేదేం లేక తనడ్రీమ్‌ ని పక్కన పెట్టింది. ఈ విషయాన్ని నమ్రత గతంలో సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

మొత్తంగా అమ్మ వల్ల తన ఇష్టాన్నే వదులుకుంది నమ్రత. ఆ తర్వాత మోడలింగ్‌లోకి వచ్చి, హీరోయిన్‌గా మారి, స్టార్‌ హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ నమ్రత వాళ్ల అమ్మ తన డ్రీమ్‌కి ప్రయారిటీ ఇచ్చి ఉంటే, తన ఇష్టాన్ని ఎంకరేజ్‌ చేసి ఉంటే, ఆమె నిజంగానే ఎయిర్‌ హోస్టెస్‌ అయ్యుండేది. ఆ రంగంలోనే సెటిల్‌ అయ్యేది. సినిమాల్లోకి వచ్చేది కాదు. మహేష్‌ బాబుని కలిసేది కాదు, ఆయన్ని పెళ్లి చేసుకునేది కాదు. టాలీవుడ్‌లో ఈ ప్రేమ కథకు బీజం పడేది కాదు.

ఎయిర్ హోస్టెస్ కావాలనే నమ్రత కల

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది నమ్రత. మహేష్‌ బాబు ముందుగానే సినిమాల్లో నటించ వద్దని కండీషన్‌ పెట్టాడట. ఆ కండీషన్‌ కోసమే తాను సినిమాలు మానేసినట్టు తెలిపింది నమ్రత. అంతేకాదు మున్ముందు కూడా తాను నటించే అవకాశం లేదని స్పష్టం చేసింది .

నమ్రత యొక్క అసలు కలను ఆమె అమ్మ అడ్డుకున్నందున, ఆమె జీవితం వేరే మార్గంలో సాగింది. మహేష్ బాబుతో ఆమె ప్రేమ, పెళ్లి జరగడం జీవితంలో ఒక మలుపు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.