
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నందమూరి అలేఖ్య సంచలనకరమైన పోస్ట్ చేశారు. 20 ఏళ్ల స్నేహాన్ని గురించి ఆమె పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. వారి బలమైన బంధం అందరినీ ఆకట్టుకుంటోంది.
Key Points
నందమూరి అలేఖ్య, కల్వకుంట్ల కవితతో తన 20 ఏళ్ల స్నేహాన్ని గురించి పోస్ట్ చేశారు.
ఈ స్నేహం ఎలాంటి వివాదాలనైనా తట్టుకుని నిలబడిందని ఆమె పేర్కొన్నారు.
అలేఖ్య, కవితతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నెటిజన్లు ఈ పోస్ట్‌పై వివిధ రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
20 ఏళ్ల స్నేహం
గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ( Kalvakuntla Kavitha) నందమూరి అలేఖ్య (Nandamuri Alekhya) ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 20 సంవత్సరాలుగా.. తమ స్నేహం కొనసాగుతోందని.. అప్పటినుంచి ఇప్పటివరకు… తమ బంధం మరింత స్ట్రాంగ్ అయిందంటూ సంచలన పోస్ట్ పెట్టింది నందమూరి అలేఖ్య. ఎలాంటి తుఫాన్లు, వివాదాలు, చిన్నచిన్న గొడవలు వచ్చినప్పటికీ తమ బంధం మాత్రం అందరిలా విడిపోలేదని ఆమె పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత అంటే తనకు అభిమానమని… 20 సంవత్సరాలుగా… ఇద్దరం ఎంతో కలిసిమెలిసి ఉంటున్నామని చెప్పుకొచ్చారు అలేఖ్య. ఈ బంధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని… వెల్లడించారు. ఇలాంటి సందర్భంలోనైనా తమ… స్నేహానికి ముప్పు ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాజాగా కల్వకుంట్ల కవితతో దిగిన ఎమోషనల్ ఫోటోను కూడా షేర్ చేశారు నందమూరి అలేఖ్య.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఫోటో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరిదీ మంచి అనుబంధం, కలకాలం అలాగే ఉండాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది గులాబీ పార్టీకి ( BRS Party ) నందమూరి అలేఖ్య దగ్గరవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన
A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)
నందమూరి అలేఖ్య మరియు కల్వకుంట్ల కవితల మధ్య ఉన్న స్నేహం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.


