
📌 Key Points
- సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి.
- 1974లో బాలనటుడిగా, 1976లో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 12 సినిమాలు చేశారు.
- చెన్నైలో వ్యాపారాలు చూసుకునేందుకు 39 ఏళ్లు సినిమాలకు దూరం అయ్యారు.
- ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల కోరిక మేరకు సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సినీ రంగ ప్రవేశం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడి కుమారుడైన ఈయన ఇన్ని సంవత్సరాలు సినిమాలకు ఎందుకు దూరమయ్యారో, ఏం చేశారో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ రీఎంట్రీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కళ్యాణ్ చక్రవర్తి సుదీర్ఘ విరామానికి కారణాలు
Nandamuri Kalyan Chakravarthy: నందమూరి కుటుంబం నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకరు. ఈయన స్వయనా సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు కొడుకు. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారులిద్దరూ కూడా సినిమాల్లో నటించారు. పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి.. ఈయన గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అప్పట్లో ఈయన సినిమాలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చినీయంశంగా మారింది.. ఇన్నేళ్లు ఆయన ఏం చేశారు? ఎందుకు మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…
నందమూరి కళ్యాణ చక్రవర్తి, 1974లో ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలో బాలనటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1976లో ‘అత్తగారు స్వాగతం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ పైన ‘తలంబ్రాలు, మామా కోడలు సవాల్, ఇంటిదొంగ, మారణ హోమం వంటి దాదాపు 12 సినిమాలను చేశాడు. ఆ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెన్నైలోనే తన వ్యాపారాలను చూసుకునేందుకు వెళ్లారు. తన బిజినెస్ లతో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు స్వస్తి చెప్పేసారు. దాదాపు 39 ఏళ్ల వరకు ఆయన ఎటువంటి సినిమాల్లో నటించలేదు. రీసెంట్ గా వచ్చిన రోషన్ హీరోగా నటించిన సినిమా ఛాంపియన్ లో కనిపించారు. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఈయన గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం ఈయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాలకు దూరంగా ఉన్న కారణాలని వివరించారు..
వ్యాపారాలు, సినీ కెరీర్ ప్రస్థానం
ఇష్టం లేకున్నా సినీ రంగ ప్రవేశం
రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ తన సినిమా కెరియర్ ఎలా మొదలైంది అన్న విషయాన్ని పంచుకున్నారు. నందమూరి ఫ్యామిలీ లోని అందరూ హీరోలు కూడా సినిమా అంటే ఒక ఫ్యాషన్ గా భావించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కానీ కళ్యాణ్ చక్రవర్తి మాత్రం అయస్టంగానే ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.. కొన్నేళ్లపాటు ఇష్టం లేకుండానే సినిమాలు చేశాను. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా చేసినట్లు ఆయన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే వ్యాపారాలను పెంచుకునేందుకు సినిమాలకు దూరమైనట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.. ఇన్నాళ్లకు రీయంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి ఇకమీదట సినిమాల్లో కొనసాగుతారా? మళ్లీ తన వ్యాపారాలు చూసుకునేందుకు సినిమాలకు గుడ్ బై చెప్తారా అన్నది చూడాలి.
కళ్యాణ్ చక్రవర్తి సుదీర్ఘ విరామం అనంతరం ‘ఛాంపియన్’ సినిమాతో మళ్లీ తెరపై కనిపించడం ఆనందకరం. ఆయన తన ప్రయాణాన్ని పంచుకోవడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆయనను చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


