|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలా చేసి తప్పు చేశా నన్ను క్షమించండి నాని.. అసలు విషయం చెప్తూ నటుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published: 31-05-2025, 3:24 AM
అలా చేసి తప్పు చేశా నన్ను క్షమించండి నాని.. అసలు విషయం చెప్తూ నటుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్

‘సరిపోదా శనివారం’ సినిమాలోని విలన్ ఎస్‌.జే. సూర్యకు లభించిన గద్దర్ అవార్డుపై నాని స్పందించిన తర్వాత, సూర్య చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. తన తప్పును గుర్తించి ఆయన నానికి క్షమాపణలు చెప్పారు.

Key Points

1

ఎస్‌.జే. సూర్య 'సరిపోదా శనివారం' సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్నారు.

2

నాని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

4

సూర్య నానికి తన తప్పుకు క్షమాపణలు చెప్పారు.

‘సరిపోదా శనివారం’ విజయం

నేచురల్ స్టార్ నాని (nani), ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) జంటగా నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ(Vivek Atreya) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే ఇందులో ఎస్‌జే సూర్య(SJ Surya) విలన్‌గా నటించగా.. అభిరామి కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీ గత ఏడాది ఆగస్టు 29 థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ఇటీవల ఈ సినిమాకు ప్రతిష్టాత్మక గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇందులో విలన్‌గా నటించిన ఎస్ జే సూర్యకు లభించింది.ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు.

దీనికి ఎస్‌జే సూర్య రిప్లై ఇచ్చినప్పటికీ అది సరిగ్గా ఉండకపోవడంతో ఆయనపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. తాజాగా, ఎస్ జే సూర్య, నానికి క్షమాపణలు చెప్తూ ట్వీ్ట్ చేశారు. ‘‘డియర్ నాని సార్ నన్ను క్షమించండి షూటింగ్ మధ్యలో ఉన్న నేను ఆ ట్వీట్ చేశాను. కాబట్టి అది సరైన ట్వీట్ కాదు చిన్న మిస్టేక్ చేశాను. ధన్యవాదాలు సార్ మీరు, వివేక్ ఆత్రేయ సార్ లేకపోతే అలాంటి అవుపుట్ వచ్చేది కాదు. మీరు స్క్రీన్‌పై మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా హీరోనే. మీ మాటలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ వివాదం

క్షమాపణలు

ఎస్‌.జే. సూర్య తన తప్పును అంగీకరించి నానికి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.