|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని బర్త్‌డేకు ఊరమాస్ ట్రీట్! ‘ది ప్యారడైజ్’ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఫిక్స్!!

Published: 09-02-2026, 10:15 AM
నాని బర్త్‌డేకు ఊరమాస్ ట్రీట్! 'ది ప్యారడైజ్' నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఫిక్స్!!
  • నాని ‘ది ప్యారడైజ్’ నుండి బ్లాస్టింగ్ అప్‌డేట్: అనిరుధ్ మాస్ బీట్‌తో ఇంట్రో సాంగ్ షూటింగ్ ప్రారంభం!
  • విజయ్ ‘జన నాయగన్’ ఫేమ్ సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని ఊరమాస్ స్టెప్పులు, గూస్‌బంప్స్ ఖాయం!
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు!
  • SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో భారీ యాక్షన్ డ్రామా!

న్యాచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకు ఇది నిజంగా పండగే.

అనిరుధ్ మ్యూజిక్ తో నాని మాస్ స్టెప్పులు!

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. వందలాది మంది డ్యాన్సర్స్ కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్‌ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్‌ అందించారు.

రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్. విజయ్ ‘జన నాయగన్’ కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్ మూవ్స్, పవర్‌ఫుల్ ఫార్మేషన్స్‌తో ఈ పాటను గూస్‌బంప్స్ కలిగించే విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారు. నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ది ప్యారడైజ్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ షూటింగ్ అప్డేట్స్!

మోహన్ బాబుతో నాని యాక్షన్ సీన్స్!

నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.