|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

27 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న నారా రోహిత్ లేటెస్ట్ మూవీ సుందరకాండ.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే ?

Published: 17-09-2025, 10:14 AM
27 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న నారా రోహిత్ లేటెస్ట్ మూవీ సుందరకాండ.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే ?

నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా థియేటర్లలో విడుదలై 27 రోజులకే ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ కూడా నటించారు.

సుందరకాండ ఓటీటీ రిలీజ్ వివరాలు

నారా రోహిత్ ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ గతేడాది ప్రతినిధి 2 తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది నారా రోహిత్ నుంచి ఇప్పటికే 2 చిత్రాలు విడుదలయ్యాయి. మే నెలలో రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ భైరవంలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లతో నారా రోహిత్ నటించారు. ఆ మూవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

గత నెలలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ కలసి నటించిన సుందరకాండ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అయిందని అంతా అన్నారు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అయితే పొందలేకపోయింది.

చిత్ర కథాంశం: ఒక బోల్డ్ ప్రేమకథ

థియేటర్స్ లో రిలీజైన 27 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో సుందరకాండ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి సుందరకాండ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలవుతుంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. నారా రోహిత్ 30 ఏళ్ళు దాటినప్పటికీ బ్యాచిలర్ గానే ఉంటాడు. తాను స్కూల్ లో ప్రేమించిన శ్రీదేవి విజయ్ కుమార్ లాంటి అమ్మాయి దొరికేవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. శ్రీదేవి విజయ్ కుమార్ స్కూల్ లో నారా రోహిత్ కి సీనియర్. చాలా సంబంధాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేస్తుంటాడు.

నటీనటులు మరియు సినిమా విశేషాలు

ఒకసారి హీరోయిన్ వృతి వాఘానిని చూసి తనకి నచ్చే లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయని భావిస్తాడు. దీనితో ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. హీరోయిన్ ని ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత శ్రీదేవి విజయ్ కుమార్ పాత్ర తిరిగి ఎలా ఎంట్రీ ఇస్తుంది ? ఆ తర్వాత కథ ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కథ కాస్త బోల్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. బుల్లితెరపై ఈ చిత్రాన్ని మరికొన్ని రోజుల్లోనే ఎంజాయ్ చేయవచ్చు.

చివరగా, సుందరకాండ చిత్రం 27 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కావడం ఆశ్చర్యం కలిగించింది. కామెడీ మరియు బోల్డ్ కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.