
నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలో విడుదలవుతోంది. ఆగస్టు 27న విడుదలైన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
Key Points
నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' సినిమా సెప్టెంబర్ 23 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్.
ఆగస్టు 27న విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలో త్వరగా విడుదలవుతోంది.
శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని కూడా ఈ చిత్రంలో నటించారు.
సుందరకాండ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
సుందరకాండ ఓటీటీ విడుదల తేదీ
తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
సుందరకాండ ఓటీటీ రిలీజ్ డేట్
వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్ లో నారా రోహిత్ నటించిన మూవీ సుందరకాండ. ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. “ఏ రెండు లవ్ స్టోరీలు ఒకేలా ఉండవు.
నారా రోహిత్, శ్రీదేవి నటన
సుందరకాండ మూవీని సెప్టెంబర్ 23 నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో చూడటానికి రెడీగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. దీనికి మూవీ పోస్టర్ కూడా యాడ్ చేసింది. ఇందులో సినిమాలో మూడు లీడ్ క్యారెక్టర్స్ ను చూడొచ్చు.
నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ మూవీ సుందరకాండ. ఈ సినిమాతో శ్రీదేవి విజయ్ కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవితోపాటు వృతి వాఘాని హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంటి.
సుందరకాండ కథాంశం
అయితే కథలోని మలుపులు ఇంట్రెస్టింగా అనిపిస్తాయి. ఈ మూవీ ముదురు బ్రహ్మచారి అయిన సిద్ధార్థ్ (నారా రోహిత్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. తన సీనియర్, మరో అమ్మాయిని ఒకేసారి ప్రేమించే సిద్ధార్థ్ పరిస్థితి చివరికి ఏమవుతుందన్నది ఈ సుందరకాండలో చూడొచ్చు. ఈ స్టోరీకి కామెడీని జోడించి మూవీని బోర్ కొట్టకుండా నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఇక చాలా రోజుల తర్వాత వచ్చిన నారా రోహిత్, శ్రీదేవి తమ పాత్రల్లో బాగా నటించారు. వాళ్లే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మరి థియేటర్లలో అంతంత మాత్రం రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సుందరకాండ మూవీ జియోహాట్‌స్టార్ లో ఏం చేస్తుందో చూడాలి.
థియేటర్లలో సగటు ప్రతిస్పందన పొందిన సుందరకాండ, జియోహాట్‌స్టార్‌లో ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. నారా రోహిత్, శ్రీదేవి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.


