|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార సంచలనం! ఒకే కథతో ముగ్గురు స్టార్ హీరోలతో రికార్డ్ హిట్!

Published: 15-01-2026, 9:05 AM
నయనతార సంచలనం! ఒకే కథతో ముగ్గురు స్టార్ హీరోలతో రికార్డ్ హిట్!
  • నయనతార, ముగ్గురు స్టార్ హీరోలతో ఒకే కథతో మూడు సూపర్ హిట్ చిత్రాలు!
  • ‘తులసి’ సినిమాలో వెంకటేష్‌తో నయనతార అద్భుతమైన జోడీగా మెప్పించారు.
  • ‘విశ్వాసం’లో అజిత్, నయనతార జోడీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.
  • చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నయనతార నటనకు ప్రశంసలు.

టాలీవుడ్ లో ఒక సంచలనం! నయనతార ఒకే కథాంశంతో ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించి, మూడు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఒకే కథ, ముగ్గురు హీరోలు: నయనతార రికార్డు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటించిన ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈసినిమా కథ కూడా భార్యాభర్తలు విడిపోయి, మళ్లీ కలవడమే. ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. అయితే నయనతార ఇదే కథతో మూడు సినిమాల్లో నటించింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

2007లో వచ్చిన ‘తులసి’ సినిమా కథ కూడా భార్యభర్తల మధ్యే జరుగుతుంది. ఈ సినిమాలో కూడా ఈగో కారణంగా హీరో వెంకటేషన్ ను వదిలి  భార్య  వెళ్ళిపోతుంది. చివరకు విలన్ నుంచి కొడుకును కాపాడటానికి, భార్యాభర్తలు మళ్లీ కలుస్తారు. ఇందులో నయనతార, వెంకటేష్ జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ తో స్క్రీన్ షేర్ చేసుకుంది నయనతార.

‘తులసి’లో వెంకటేష్‌తో నయనతార హిట్

‘తులసి’ స్ఫూర్తితో శివ తీసిన సినిమా ‘విశ్వాసం’. భర్త రౌడీ అని భార్య విడిపోతుంది. తర్వాత కూతురిని కాపాడటానికి భర్త బాడీగార్డ్‌గా వస్తాడు. తన కూతురిని రౌడీల నుంచి కాపాడుకుని.. భార్యతో కలిసిపోతాడు. అజిత్, నయనతార జోడీ ఈసినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈసినిమాా కూడా సూపర్ హిట్ అయ్యింది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కూడా చిరంజీవి, నయనతార సేమ్ కథతో కనిపించారు. ఈగో కారణంగా నయనతార చిరంజీవిని వదిలి విడాకులు తీసుకుంటుంది. ఆతరువాత తన పిల్లలను కలుసుకోవాలని వెళ్లి..ఆపద నుంచి తన ఫ్యామిలీని కాపడుకుంటాడు హీరో. కథ పాతదే అయినా, తీసిన విధానం కొత్తగా అనిపించింది. మొత్తానికి సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

‘విశ్వాసం’లో అజిత్‌తో నయనతార బ్లాక్ బస్టర్

ఈ మూడు సినిమాల్లో ఒకే కథ ఉన్నా, అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరో విశేషం ఏంటంటే, ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ నయనతారే. ఒకే కథతో మూడు హిట్లు కొట్టింది.

మొత్తానికి నయనతార ఒకే కథతో మూడు సూపర్ హిట్లు కొట్టి టాలీవుడ్‌లో తన సత్తా చాటింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.