|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార క్రేజ్: సీనియర్ హీరోల ఫస్ట్ ఛాయిస్! మరో సంచలన ఆఫర్!

Published: 07-03-2026, 11:35 PM
నయనతార క్రేజ్: సీనియర్ హీరోల ఫస్ట్ ఛాయిస్! మరో సంచలన ఆఫర్!
  • నయనతార సీనియర్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
  • ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు.
  • చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించారు.
  • బాలకృష్ణతో ‘ఎన్బికె 111’ సినిమాలో నటించడానికి అంగీకరించారు.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సీనియర్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. షారుక్ ఖాన్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన తర్వాత ఇప్పుడు బాలకృష్ణతో కలిసి నటించనున్నారు. ఆమె మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు.

సీనియర్ హీరోలకు నయనతార కేరాఫ్ అడ్రస్

Nayanthara:సాధారణంగా సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరోతో పోల్చుకుంటే.. హీరోయిన్ లకి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని” ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం మనలో టాలెంట్ ఉండాలే కానీ ఆ అదృష్టం కూడా కలిసి వస్తే దశాబ్దాల తరబడి హీరోలతో పోటీ పడవచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. అలాంటి వారిలో ప్రధమంగా వినిపించే పేరు నయనతార (Nayanthara). సౌత్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ యంగ్ హీరోయిన్స్ కి కూడా గట్టి పోటీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన నయనతార.. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే 2023లో షారుక్ ఖాన్ (Shahrukh Khan) తో ‘జవాన్’ సినిమా చేసి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన మార్కెట్ ను అమాంతం పెంచేసుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం ఆమె ఏకంగా ప్రమోషనల్ కార్యక్రమాలలో కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

బాలీవుడ్‌లో సత్తా చాటిన నయనతార

అలాగే గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna ) రెండవసారి చేస్తున్న ‘ఎన్బికె 111’ సినిమాలో కూడా మళ్లీ బాలకృష్ణతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగు లోనే కాకుండా మరొకవైపు కన్నడ హీరో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా హీరో యశ్ (Yash) సోదరి పాత్రలో నటిస్తూ తన పవర్ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ అదరగొట్టడానికి సిద్ధమయ్యింది. అలా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

మరో స్టార్ హీరోతో నయనతార సినిమా?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకప్పుడు బాలీవుడ్ షారుఖ్ ఖాన్ తో సినిమా చేసిన ఈమె.. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidi palli) దర్శకత్వంలో దిల్ రాజు (Dilraju ) నిర్మించనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ లో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా షారుక్ ఖాన్, చిరంజీవి వంటి స్టార్లతో సినిమాలు చేసి హిట్టు కొట్టిన ఈమె మళ్లీ బాలకృష్ణ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కూడా జతకట్టడంతో సీనియర్ స్టార్ హీరోలకి నయనతార కేరాఫ్ అడ్రస్ గా మారిందని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాతో నయనతార ఇంకెలాంటి రికార్డ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

నయనతార వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతున్నారు. ఆమె రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.