|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nayanthara: నయనతార-విఘ్నేశ్ విడాకుల రూమర్స్.. గట్టిగానే ఇచ్చిపడేసిందిగా!

Published: 10-07-2025, 8:17 AM
Nayanthara: నయనతార-విఘ్నేశ్ విడాకుల రూమర్స్.. గట్టిగానే ఇచ్చిపడేసిందిగా!

కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ విడాకుల వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై నయనతార తన స్పందనను ఇచ్చింది. ఆమె తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Key Points

1

నయనతార-విఘ్నేశ్ విడాకుల వార్తలపై నయనతార స్పందించారు.

2

భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వార్తలను ఖండించారు.

4

నయనతార త్వరలోనే మెగా157, టాక్సిక్ చిత్రాల్లో కనిపించనున్నారు.

విడాకుల రూమర్స్‌కు నయనతార స్పందన

కోలీవుడ్ స్టార్ జంట నయనతార- విఘ్నేశ్ శివన్‌పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు త్వరలోనే తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపించింది. ఈ స్టార్‌ కపుల్ గురించి పలు వెబ్‌సైట్స్‌లో కథనాలొచ్చాయి. దీంతో నయనతార తమపై వస్తున్న రూమర్స్‌కు గట్టి రిప్లై ఇచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ‘మాపై సిల్లీ న్యూస్ వచ్చినప్పుడల్లా మా రియాక్షన్‌ ఇలానే ఉంటుంది’ అని ఘాటుగానే బదులిచ్చింది.

సోషల్ మీడియా పోస్ట్‌ ప్రభావం

కాగా.. పెళ్లి బంధం  గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్స్‌కు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు.. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. కానీ అంతలోనే నెట్టింట స్క్రీన్‌షాట్స్‌ దర్శనమిచ్చాయి. ఆ పోస్ట్‌ వల్లే నయన్- విఘ్నేశ్‌ దంపతులు విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్‌లో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

నయనతార తాజా సినిమా అప్డేట్స్

ఇక నయనతార సినిమాలపరంగా చూస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157లో కనిపించనుంది. అంతేకాకుండా యశ్‌ హీరోగా వస్తోన్న టాక్సిక్ మూవీలోనూ కనిపించనుంది. కాగా.. నయనతార సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకున్నారు.

చివరగా, నయనతార తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తలకు స్పష్టమైన బదులిచ్చింది. ఆమె సినిమా కెరీర్ కూడా బాగుంది. ఈ విషయంపై ప్రేక్షకుల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.