|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NBK 111: బాలయ్య కొత్త సినిమాకు ‘మహారాజు’గా పట్టాభిషేకం? టైటిల్ లీక్!

Published: 17-12-2025, 12:38 AM
NBK 111: బాలయ్య కొత్త సినిమాకు 'మహారాజు'గా పట్టాభిషేకం? టైటిల్ లీక్!
  • నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న NBK 111 చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
  • ఈ సినిమాకు ‘మహారాజు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
  • బాలయ్య ద్విపాత్రాభినయంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది, ఒక పాత్ర మహారాజుది.
  • నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు; బాలకృష్ణ మరో పాట పాడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న NBK 111 సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘మహారాజు’ అనే పవర్ఫుల్ టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

NBK 111: ‘మహారాజు’ టైటిల్ వెనుక అసలు కథ

NBK 111: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం బాలయ్య తన తదుపరి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. బాలకృష్ణ తన తదుపరి సినిమాని డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బాలకృష్ణ స్వయంగా మరో పాట పాడబోతున్నారని ఈ పాట అచ్చం బాహుబలి సినిమాలో సాహోరే బాహుబలి రేంజ్ లో ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేయగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని స్పష్టమైనది, అలాగే బాలయ్య మహారాజు పాత్రలో కనిపించబోతున్నట్టు పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి నయనతారకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా బాలయ్య సందడి

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కోసం ” మహారాజు” (Maharaju)అని టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోంది. ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

పిరియాడికల్ యాక్షన్ డ్రామగా..

ద్విపాత్రాభినయం, కీలక పాత్రలో నయనతార

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలన్నింటిలోనూ ఆయన రెండు విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇదివరకు బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వీర సింహారెడ్డి సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను అధికారకంగా వెల్లడించనున్నారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం, నయనతార మహారాణి పాత్రతో ‘మహారాజు’ టైటిల్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. త్వరలోనే టైటిల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది, అప్పటివరకు ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి మరింత పెరుగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.