|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏ ఆర్ రెహమాన్‌ను ఎందుకు ప్రశ్నించలేదన్న నెటిజన్.. దయచేసి నోరు మూసుకో అంటూ చిన్మయి ఫైర్

Published: 12-11-2025, 3:00 AM
ఏ ఆర్ రెహమాన్‌ను ఎందుకు ప్రశ్నించలేదన్న నెటిజన్.. దయచేసి నోరు మూసుకో అంటూ చిన్మయి ఫైర్

గాయని చిన్మయి, జానీ మాస్టర్‌ను లక్ష్యంగా చేసుకుని పోస్ట్‌లతో వార్తల్లో నిలిచింది. ఇటీవల, ఏఆర్ రెహమాన్‌తో జానీ కనిపించినప్పుడు చిన్మయి మౌనంపై ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. దీనికి ఆగ్రహించిన చిన్మయి, “దయచేసి నోరు మూసుకో” అంటూ ఘాటుగా స్పందించింది.

Key Points

1

సింగర్ చిన్మయి గత కొద్ది రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

2

జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో బెయిల్‌పై విడుదలై, మళ్లీ అవకాశాలు అందుకుంటున్నాడు.

4

నెటిజన్ ప్రశ్నకు ఆగ్రహించిన చిన్మయి, 'దయచేసి నువ్వు నోరు మూసుకో' అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

చిన్మయి-జానీ మాస్టర్ వివాదం

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయి(Chinmayi) గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్‌ను టార్గెట్ చేస్తోంది. పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జానీ మాస్టర్ (Jani Master)లైంగిక ఆరోపణల కారణంగా జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంతో మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ మళ్లీ ఫామ్‌లో వచ్చేశాడు. ఇటీవల జరిగిన శ్రీలంక షూట్‌లో జాన్వీ కపూర్, రామ్ చరణ్‌కు డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. ఇక దీనిపై చిన్మయి తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. అలాంగి వ్యక్తికి అవకాశం ఇవ్వడంపై పండిపడింది.

నెటిజన్ ప్రశ్న.. చిన్మయి ఆగ్రహం

అలాగే అతన్ని శిక్షించాలని కోరింది. కానీ ఇటీవల ఏఆర్ రెహమాన్‌తోజాని కనిపించిన సమయంలో సైలెంట్‌గా ఉంది. తాజాగా, ఓ నెటిజన్ చిన్మయిని ప్రశ్నించాడు. అక్క మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్, చిన్మయిది దొంగల నైజం అని పెట్టాడు. అలాగే ఏఆర్ రెహమాన్(AR Rahman) కూడా పని చేశారని ఆయనను ఎందుకు అడగలేదని పోస్ట్ అన్నాడు. ఇక దీనిపై చిన్మయి స్పందిస్తూ..‘‘దయచేసి నువ్వు నోరు మూసుకో. నేను ఏఆర్ రెహమాన్ సార్‌ను కూడా అడిగాను. ఆయన దీని గురించి ఏమీ తెలియదు అని అన్నారు. నేను తమిళ చిత్ర పరిశ్రమలోని ముఖ్యమంత్రులను, అతి పెద్ద నటులను కూడా ప్రశ్నించాను’’ అని ఫైర్ అయింది.

AR రెహమాన్ ప్రస్తావనపై వివరణ

అలాగే కోర్టుకు వెళుతూ, వేధింపులకు గురవుతున్నది మీరు కాదు. అందువల్ల శక్తివంతమైన వ్యక్తులు కూడా వేధింపులకు పాల్పడిన వ్యక్తితో పని చేశాడని తెలుసుకొని, నన్ను నిలదీయడం ఆపండి. మీరంతా మీ ఆదర్శమూర్తులను ప్రశ్నించవచ్చు. నేను ఎల్లప్పుడూ ఈ పనిని చేయలేను. నేను చేశాను. చాలా నష్టపోయాను. చాలా తిట్లు తిన్నాను. చాలా వేధింపులకు గురయ్యాను. మీరు పోగొట్టుకోవడానికి ఏమీ లేని, అజ్ఞాత ట్విటర్ హ్యాండిల్!” అని రాసుకొచ్చింది.

చిన్మయి తన ఆవేదనను వ్యక్తపరుస్తూ, తాను కూడా AR రెహమాన్‌ను ప్రశ్నించినట్లు, తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈ వివాదం ఆమె ధైర్యానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరాటానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.