|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్‌.. సెల్ఫీలంటే ముఖం చాటేస్తోంది!

Published: 24-07-2025, 5:44 AM
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్‌.. సెల్ఫీలంటే ముఖం చాటేస్తోంది!

‘సైయారా’ సినిమాతో హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనీత్ పడ్డా, తాజాగా సెల్ఫీలకు దూరంగా ఉంటూ కనిపించింది. ఓ అభిమాని సెల్ఫీ కోసం అడిగినపుడు ఆమె నిరాకరించింది. ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్ అయింది.

Key Points

1

సినిమా ‘సైయారా’తో అనీత్ పడ్డా సెన్సేషన్‌ అయ్యింది.

2

మూవీ కేవలం మౌత్ టాక్ తోనే రూ.153 కోట్లు వసూలు చేసింది.

4

మాస్క్ ధరించిన అనీత్ సెల్ఫీకి నిరాకరించింది, వీడియో వైరల్ అయింది.

‘సైయారా’ సినిమా విజయం

ఒక్క సినిమాతో సెన్సేషన్‌ అయింది యంగ్‌ బ్యూటీ అనీత్‌ పడ్డా ( Aneet Padda ). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా ( Saiyaara Movie ). అహాన్‌ పాండే (అనన్య పాండే కజిన్‌) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్‌ కూడా వస్తున్నాయి. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అనీత్ పడ్డా సెల్ఫీ నిరాకరణ

వీడియో వైరల్‌ ఇదిలా ఉంటే తాజాగా అనీత్‌ పడ్డా ముంబైలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్‌ ధరించిన అనీత్‌.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్‌గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనీత్‌ పడ్డా.. గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది.

వైరల్ వీడియో

అనీత్ పడ్డా తన కెరీర్ ప్రారంభంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సెల్ఫీ నిరాకరణ వీడియో వైరల్ అవడంతో ఆమె గురించి మరింత చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.