|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాది బెంగళూరు.. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం.. ఆ సినిమాను 20 సార్లు చూశా.. కొత్త హీరోయిన్ ఐరా కామెంట్స్

Published: 06-10-2025, 9:52 AM
నాది బెంగళూరు.. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం.. ఆ సినిమాను 20 సార్లు చూశా.. కొత్త హీరోయిన్ ఐరా కామెంట్స్

టాలీవుడ్‌కు కొత్త హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఐరా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. బెంగళూరుకు చెందిన ఐరా, ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటానని, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాన్ని 20 సార్లు చూశానని వెల్లడించింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చైతన్య రావుతో కలిసి నటిస్తున్న తన తొలి సినిమా విశేషాలు తెలిపింది.

Key Points

1

కొత్త హీరోయిన్ ఐరా బెంగళూరుకు చెందినప్పటికీ ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటారని తెలిపారు.

2

'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాను దాదాపు 20 సార్లు చూశానని ఐరా వెల్లడించారు.

4

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు ఐదో సినిమా, చైతన్యతో రెండో ప్రాజెక్ట్.

హీరోయిన్ ఐరా నేపథ్యం, ఇష్టమైన సినిమా విశేషాలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఇప్పటికీ తెలుగులోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌ గా డెబ్యూ చేసి అలరించారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాతో హీరోయిన్స్‌గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనున్నారు.

వారే ఐరా, సాఖి. టాలీవుడ్ నటుడు, 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు మయసభ, ఘాటి తర్వాత చేస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్‌గా పరిచయం కానున్నారు. శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ 5గా ఈ సినిమాను ప్రారంభించారు.

ఈ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. డైరెక్టర్ దేవ కట్టా క్లాప్ కొట్టి ప్రారంభించిన ఈ సినిమా లాంచ్ వేడుకలో హీరోయిన్ ఐరా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది. అలాగే, మూవీ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కామెంట్స్ చేశారు.

కొత్త సినిమాపై డైరెక్టర్ క్రాంతి మాధవ్ కామెంట్స్

హీరోయిన్ ఐరా మాట్లాడుతూ .. “నాది బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది. కానీ, తమిళంలో నా పరిచయం జరిగింది. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే చిత్రం చాలా ఇష్టం. నేను ఆ మూవీని దాదాపు 20 సార్లు చూసి ఉంటాను” అని చెప్పింది.

“క్రాంతి గారి నుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను. కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం నా అదృష్టం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. చైతన్యతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను” హీరోయిన్ ఐరా తెలిపింది.

ఐరా సినీ రంగ ప్రవేశం: బెంగళూరు టూ టాలీవుడ్

దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ .. “ఇది నాకు ఐదో చిత్రం. చైతన్యతో రెండో సినిమా. పూర్ణా నాయుడు, శ్రీకాంత్ గార్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఐరా తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. సాఖీ బెంగాలీలో సీరియల్స్‌ చేశారు. ఈ మూవీతో ఆమె కూడా తెలుగులోకి రాబోతోన్నారు” అని వెల్లడించారు.

“చైతన్య, పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తరువాత పూర్ణ గారితో ఓ మూవీని చేయాలి. హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది. అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నాం” అని క్రాంతి మాధవ్ పేర్కొన్నారు.

ఐరా తన తొలి తెలుగు సినిమాపై ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించారు. తన ఇష్టమైన తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కొత్త చిత్రం విజయవంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.