
సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
నిధి అగర్వాల్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెడ్ రోజ్ ఫ్లవర్స్ తో అందాలను ఆరబోసింది నిధి.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్న నిధి.
నిధి అగర్వాల్ తాజా ఫోటో షూట్
సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అటు ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నిధి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ట్రెండింగ్ అవుట్ ఫిట్‌లో అందాలు ఆరబోసింది. రెడ్ కలర్ రోస్ ఫ్లవర్స్ పెట్టుకుని స్టిన్నింగ్స్ లుక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది.దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఒక పువ్వు మరో పువ్వును పెట్టుకోవడం భలే బాగుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన
A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)
నిధి అగర్వాల్ తన అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే, ‘రాజా సాబ్’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలతో తన నటనా ప్రతిభను కూడా చాటుకుంటోంది. ఆమె భవిష్యత్ కెరీర్‌పై అందరికీ ఆసక్తి.


