
📌 Key Points
- నిహారిక నిర్మాతగా రాకాస సినిమా ఏప్రిల్ 3న విడుదల, భారీ అంచనాలు!
- కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిహారిక భారీ విజయం, కొత్త టాలెంట్ ప్రోత్సాహం
- వరుణ్ తేజ్ ‘బరి’ సినిమాతో నిహారిక మరో సంచలనం, భారీ తారాగణం!
- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక వరుస విజయాలు, ఓటీటీలోనూ హవా!
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన సత్తా చాటుతోంది. ఆమె నిర్మిస్తున్న రాకాస సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం.
నిర్మాతగా నిహారిక సక్సెస్ ఫుల్ జర్నీ!
Niharika : మెగా డాటర్ నిహారిక యాంకర్ గా టీవీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతుంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, సినిమాలు.. ఇలా నిర్మాతగా వరుస హిట్స్ కొడుతుంది. నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన రాకాస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.
రాకాస మూవీతో నిహారిక మరో ప్రయత్నం!
ఈ ఈవెంట్లో నిహారిక మాట్లాడుతూ.. నేను కమిటీ కుర్రాళ్ళు సినిమా చేసినప్పుడు 15 మంది కొత్తవాళ్లను ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక మంచి సినిమా చేయొచ్చు కదా అందరికి తెలిసింది. యంగ్ కథలు ఏదైనా చేయొచ్చు కదా ఈ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎందుకు అన్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా చేస్తుంటే ఇలాగే చిన్న చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా ఎందుకు ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నావు అంటున్నారు. నేనేం ఏం చేసినా నన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నేను చేసేది చేస్తూనే ఉంటా అని తెలిపింది.
వరుణ్ తేజ్ తో కలిసి బరి మూవీ నిర్మాణం!
తన సక్సెస్ పై, తన వర్క్ పై చేసే కామెంట్స్ కి ఇలా సమాధానమిచ్చింది నిహారిక. దీంతో నిహారిక కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే నిహారిక ప్రతి స్క్రిప్ట్ ని జాగ్రత్తగా ఎంచుకొని తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మంచి సినిమాలు నిర్మిస్తుంది. ఆల్రెడీ యూట్యూబ్, ఓటీటీలలో హిట్స్ కొట్టిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు రాకాస సినిమాతో ఏప్రిల్ 3న రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత వరుణ్ తేజ్ తో బరి అనే సినిమా భారీగా తెరకెక్కిస్తోంది.
నిహారిక తన పనితో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. రాకాస సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


