|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Niharika: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్‌… దర్శకుడు య‌దు వంశీతో నిహారిక మ‌రో మూవీ

Published: 08-10-2025, 8:29 AM
Niharika: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్‌… దర్శకుడు య‌దు వంశీతో నిహారిక మ‌రో మూవీ

నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విజయవంతమైన కాంబో మళ్ళీ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Key Points

1

నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో వచ్చిన 'కమిటీ కుర్రోళ్లు' భారీ విజయం సాధించింది.

2

రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను రాబట్టింది.

4

ఈ కొత్త చిత్రం 2026లో విడుద‌ల కానుంది; పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 కూడా సిద్ధమవుతోంది.

‘కమిటీ కుర్రోళ్లు’ బ్లాక్‌బస్టర్ విజయం

Niharika: కమిటీ కుర్రోళ్లు.. గ‌త ఏడాది చిన్న సినిమాగా విడుద‌లై భారీ భారీ విజయాన్ని సాధించింది. మెగా(Niharika) డాటర్ నిహారిక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో పొలిటికల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాతో మొత్తం 11 మంది కొత్త నటీనటుకు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కేవలం రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.24.5 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

నిహారిక, యదు వంశీ కాంబో రిపీట్: కొత్త సినిమా వివరాలు

SSMB29: మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మరో ‘నాటు నాటు’ సాంగ్ సిద్ధం.. కానీ ఈసారి..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తాజా ప్రాజెక్టులు

ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరోసారి ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఈ కథను సిద్ధం చేశాడట దర్శకుడు యదు వంశీ. 2026 మొదట్లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక నిర్మాణంలో వస్తున్న సినిమాల విషయానికి వస్తే, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 కొత్త సినిమా తెరకెక్కుతోంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యాంటసీ, కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత నిహారిక, యదు వంశీ కాంబోలో రాబోయే ఈ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో మరిన్ని ప్రాజెక్టులు వస్తుండటంతో నిహారిక నిర్మాతగా బిజీ కావడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.