|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమ యాచన కాదు.. ప్రేమగా మారిపో! నిహారిక సంచలన ప్రకటన, అసలేం జరిగిందంటే?

Published: 14-03-2026, 12:05 PM
ప్రేమ యాచన కాదు.. ప్రేమగా మారిపో! నిహారిక సంచలన ప్రకటన, అసలేం జరిగిందంటే?
  • నిహారిక కొణిదెల నిర్మాతగా ‘రాకాస’ మూవీ
  • ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
  • ఏప్రిల్ 3న ‘రాకాస’ మూవీ విడుదల కానుంది.
  • ‘పదే పదే’ సాంగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది అని నిహారిక అన్నారు.

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె నిర్మిస్తున్న ‘రాకాస’ సినిమాలోని ‘పదే పదే’ పాట విడుదల సందర్భంగా నిహారిక ఈ వ్యాఖ్యలు చేశారు.

నిహారిక కొణిదల ‘రాకాస’ మూవీ విశేషాలు

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రేమ గురించి మాట్లాడుతుందంటే.. ఆమె ఏమైనా ప్రేమలో పడిందా? అనే అనుమానాలు రావడం సహజమే. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఆమె నటించిన సినిమాకు సంబంధించి చెబుతూ నిహారిక ప్రేమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. ఇప్పుడు తన బ్యానర్‌ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌‌పై జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’ (Rakasa). మానస శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 3న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రంలోని ‘పదే పదే’ (Padhe Padhe Song) అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు.

‘పదే పదే’ సాంగ్ విడుదల చేసిన నిహారిక

ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా ‘రాకాస’ సినిమాలోని ‘పదే పదే’ సాంగ్‌ని రిలీజ్ చేయడానికి కాకుండా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని ఈ కాలేజ్‌లో నిర్వహిస్తే బాగుండేదనిపిస్తోంది. ‘పదే పదే’ అనేది మంచి లవ్ సాంగ్. వన్ సైడ్ లవ్ అనిపించినా, ప్రతి ఒక్కరికీ రిలెటెడ్‌గా ఉంటుంది. మనం ప్రేమ గురించి ఎప్పుడూ ప్రాధేయపడకూడదు. మనమే ప్రేమలా మారిపోవాలి. అదే మా ఈ ‘పదే పదే’ పాట. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మానస తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న మా మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 3న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలని కోరారు. హీరోయిన్ న‌య‌న్ సారిక‌ మాట్లాడుతూ.. ‘పదే పదే’ పాటను నేను లూప్‌లో వింటూనే ఉన్నాను. ముఖ్యంగా గర్ల్స్ ఎక్కువగా ఏదీ అంత త్వరగా బయటకు ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాంటి వారికి ఈ పాట చాలా నచ్చుతుంది. ఏప్రిల్ 3న వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు.

ప్రేమ గురించి నిహారిక ఏమన్నారంటే?

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. ‘మ్యాడ్’ తర్వాత ఎలాంటి కథ చేయాలా? అని అనుకుంటున్న టైమ్‌లో మానస శర్మ నాకు ఈ కథ చెప్పారు. ఆడియెన్స్‌కి మంచి కథలు, మంచి సినిమాలు ఇవ్వాలని మానస ప్రయత్నం చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌గా ‘రాకాస’ ఉంటుంది. ‘రపప్పా.. రపప్పా’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘పదే పదే’ పాటని విడుదల చేస్తున్నాం. ఈ పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మా అందరికీ ఈ పాట ఫేవరేట్. హీరోయిన్, గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాట అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 3న రాబోతున్న ఈ సినిమాను చూసి సక్సెస్ చేయండి. సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ ఈ కాలేజ్‌కి వచ్చి అందరినీ కలుస్తామని చెప్పుకొచ్చారు. ఈ పాటను అమ్మాయిలకు డెడికేట్ చేస్తున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ తెలిపారు.

నిహారిక ‘రాకాస’ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.