
📌 Key Points
- పెద్ది సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదలై 400 కోట్లు వసూలు చేసింది.
- జులై 9న నెట్ఫ్లిక్స్లో ఓటీటీ రిలీజ్ అయింది.
- థియేటర్ వెర్షన్లో కట్ చేసిన సీన్లు ఓటీటీలో యాడ్ చేశారు.
- జాన్వీ గ్లామర్ సీన్లు మాత్రం ఓటీటీలో చేర్చలేదు.
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జులై 9న నెట్ఫ్లిక్స్లో ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్ వెర్షన్లో కట్ చేసిన సీన్లు డిజిటల్ వెర్షన్లో యాడ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం.
పెద్ది ఓటీటీ రిలీజ్ తేదీ మరియు వివరాలు
Peddi OTT: గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగిన చరణ్ ఈసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్దిని పట్టాలెక్కించాడు.ఇక ఎన్నో వాయిదాల పాటలు పాడిన ఈ సినిమా ఎట్టకేలకి జూన్ 4, 2026న థియేటర్ లోకి వచ్చింది.తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఏకంగా 400 కోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టి మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.ఇక థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సరిగ్గా 35 రోజులకి ఈ రోజే అంటే జులై 9న ప్రముఖ OTT ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
థియేటర్ వెర్షన్ లో కొన్ని సీన్స్ కట్
అయితే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కావడానికి టైమ్ పడుతుందని, ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే 189 నిమిషాల లెంత్ తో వచ్చిన పెద్ది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ బాగా ఉందన్న కామెంట్స్ రావడంతో థియేటర్ వెర్షన్ లో కొన్ని సీన్స్ కట్ చేశాడు బుచ్చి బాబు.వీటితో పాటు జాన్వీ పాప అందాల ఆరబోత కూడా నేషనల్ వైడ్ గా కాంట్రవర్సీ కావడంతో వాటికి కూడా కత్తెరతో పని చెప్పాడు.
థియేటర్ vs డిజిటల్ వెర్షన్: తేడాలు ఇవే
అయితే డిజిటల్ విషయానికి వచ్చే సరికి థియేటర్ వెర్షన్ లో కట్ చేసిన సీన్స్ యాడ్ చేయడం విశేషం. ముఖ్యంగా చరణ్ ఎంతో కష్టపడి చేసిన ఎమోషనల్ సీన్స్ తో పాటు చరణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సీన్స్ యాడ్ చేయడంతో ఇదీ కదా మాక్కావాల్సింది అంటూ మురిసిపోతున్నారు మెగాఫ్యాన్స్ .అయితే కట్ చేసిన జాన్వీ గ్లామర్ డోస్ ని మాత్రం మళ్ళీ యాడ్ చేయలేదట బుచ్చి.
ఇక సినిమా విషయానికి వస్తే ..ఉప్పెన వంటి సాలిడ్ సక్సెస్ తర్వాత బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే సత్తా ఉన్న ఒక సాదాసీదా ‘ఆట కూలీ అయిన పెద్దిగా కనిపించాడు చరణ్.అలాంటి పెద్ది ఎందుకు పైల్వాన్ గా మారాడు , తన ఊరి కోసం ఏం చేశాడు అన్నదే సినిమా.ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు , బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ లతో పాటు స్పెషల్ సాంగ్ లో కనిపించి అదరగొట్టింది శృతి హసన్. ఇకరత్నవేలు విజువల్స్, AR రెహమాన్ ఇచ్చిన ట్యూన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాయ్.
సినిమా కథ మరియు నటీనటుల వివరాలు
అయితే సినిమా తెలుగు స్టేట్స్ లో సాలిడ్ వసూళ్ళని కొల్లగొట్టినప్పటికీ,నార్త్ బెల్ట్ అండ్ ఓవర్సీస్ లో అనుకున్నంత వసూల్లని చూడలేకపోయాడు పెద్ది.మరి సరికొత్త మార్పు చేర్పులతో వస్తున్న పెద్ది ఈసారి బుల్లి తెరపై ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో !
పెద్ది ఓటీటీ రిలీజ్తో మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్. థియేటర్లో కట్ చేసిన సీన్లు డిజిటల్లో చేరడం విశేషం. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మిస్ అవ్వకండి.


