|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక ‘రాకాస’ ఓటీటీ డీల్: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్! టాలీవుడ్‌లో సంచలనం!

Published: 09-03-2026, 4:35 AM
నిహారిక 'రాకాస' ఓటీటీ డీల్: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్! టాలీవుడ్‌లో సంచలనం!
  • నిహారిక కొణిదల నిర్మాతగా మారి ‘రాకాస’ సినిమాను నిర్మిస్తున్నారు.
  • ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు 10 కోట్లకు కొనుగోలు చేసింది.
  • సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
  • ఏప్రిల్ 3, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మెగా డాటర్ నిహారిక కొణిదల నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ డీల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘రాకాస’ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్

Rakasa OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’ (Rakasa). ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధర పలికినట్లు సమాచారం.

Read also- Jananayagan Censor: విజయ్ ‘జననాయగన్’ సెన్సార్‌కు మరో సారి బ్రేక్.. వాయిదాకు కారణం ఇదే!

నిర్మాతగా నిహారిక సక్సెస్

తాజా సమాచారం ప్రకారం, ‘రాకాస’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ సుమారు 10 కోట్ల రూపాయలకు క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఒక యువ హీరో సినిమాకు, అదీ విడుదల కాకముందే ఈ స్థాయిలో రేటు పలకడం విశేషం. నిహారిక గత చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం సంగీత్ శోభన్‌కు ఉన్న క్రేజ్ ఈ భారీ డీల్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

యంగ్ లేడీ దర్శకురాలు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ ‘ఫాంటసీ కామెడీ’ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణ గాథలకు, ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ సాగే ఈ కథలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

‘రాకాస’ సినిమాపై అంచనాలు

Read also- War Machine: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్నసైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ మెషిన్’.. విమర్మకులు సైతం..

నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీ స్టూడియోస్ వంటి దిగ్గజ సంస్థ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉండటం వల్ల బిజినెస్ పరంగా కూడా సినిమాకు మంచి మైలేజ్ లభిస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ‘కమిటీ కుర్రోళ్లు’తో సక్సెస్ కొట్టిన నిహారిక, ఈ ‘రాకాస’తో నిర్మాతగా తన సక్సెస్ గ్రాఫ్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఓటీటీ రూ. 10 కోట్లు డీల్ వచ్చిందంటే సినిమాలో విషయం ఉందనే అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో విజయం సాధించిన నిహారిక, ‘రాకాస’తో కూడా సక్సెస్ అందుకుంటారా లేదా చూడాలి. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.