|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండతో పెళ్లిపై నిహారిక సంచలన వ్యాఖ్యలు! అసలు నిజం ఏంటో తెలుసా?

Published: 29-03-2026, 1:35 PM
విజయ్ దేవరకొండతో పెళ్లిపై నిహారిక సంచలన వ్యాఖ్యలు! అసలు నిజం ఏంటో తెలుసా?
  • విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్లపై నిహారిక స్పందన.
  • విడాకుల తర్వాత రెండో పెళ్లి గురించి నిహారిక వ్యాఖ్యలు.
  • తరుణ్, ప్రభాస్‌లతో నిహారిక పెళ్లి వార్తలపై స్పష్టత.
  • రాకాసా సినిమా ప్రమోషన్లలో నిహారిక బిజీగా ఉన్నారు.

నిహారిక, విజయ్ దేవరకొండల పెళ్లి గురించి గతంలో వచ్చిన రూమర్లపై నిహారిక తాజాగా స్పందించారు. అంతేకాకుండా తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్లపై నిహారిక రియాక్షన్

Niharika : నిహారిక ప్రస్తుతం రాకాసా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిహారిక (Niharika) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక పెళ్లి గురించి వచ్చిన వార్తలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. నిహారికకు పెళ్లి కాకుముందే ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో నటుడు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోతోంది అంటూ అప్పట్లో వార్తలు బలంగా వచ్చాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయంపై స్పందించారు.

నేను సూర్యకాంతం సినిమా చేయకముందే మా ఇద్దరికీ పెళ్లి జరగబోతోంది అంటూ పుకార్లు వచ్చాయి అయితే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన తర్వాత ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని నిహారిక తెలిపారు. అయితే ఆరోజు వేదిక పైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నిహారిక తనకు సిస్టర్ లాంటిదని చెప్పారు. నాగబాబు గారు గీతగోవిందం సినిమాలో తనకు తండ్రిగా నటించారని అలా నాకు నిహారిక చెల్లి అవుతుంది అంటూ ఆయన చెప్పారని నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు.

రెండో పెళ్లిపై నిహారిక సంచలన ప్రకటన

ఆరోజు విజయ్ దేవరకొండ చెల్లి అని చెప్పడంతో మా అన్నయ్యలతో పాటు నేను ఇంకొకరితో సినిమా చేసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది అంటూ ఈమె ఫన్నీగా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇక నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఈమె పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాను..

తరుణ్, ప్రభాస్‌లతో పెళ్లి వార్తలపై స్పష్టత

నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని ఈమె నటుడు తరుణ్ ను పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలను హీరో తరుణ్ ఖండించారు. అలాగే ప్రభాస్ తో కూడా నిహారిక ఏడడుగులు నడవబోతున్నారంటూ ఈమె పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. ఇదే విషయం గురించి కూడా నిహారిక మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించి చాలా రూమర్లు వస్తూనే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే మొదటి పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న ఈమె ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని, ఈ సందర్భంగా నిహారిక తన రెండో పెళ్లి గురించి కూడా తెలియజేశారు.

నిహారిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం తన సినిమా కెరీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.