|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక ‘రాకాస’ ప్లాన్: రెండో సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు!

Published: 08-01-2026, 11:05 AM
నిహారిక 'రాకాస' ప్లాన్: రెండో సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు!
  • నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో తన రెండో సినిమా ‘రాకాస’ను నిర్మిస్తున్నారు.
  • సంతోష్ శోభన్ హీరోగా, మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ.
  • సినిమా టైటిల్ ‘రాకాస’తో పాటు రిలీజ్ డేట్ ఏప్రిల్ 3, 2026గా ప్రకటించారు.
  • నిహారిక మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ విజయవంతం కావడంతో దీనిపై అంచనాలున్నాయి.

మెగా డాటర్ నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా రెండో సినిమా ‘రాకాస’ను ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ కామెడీ చిత్రానికి సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను తాజాగా వెల్లడించారు. ఇది నిహారిక కెరీర్‌లో కీలక ప్రాజెక్ట్ కానుంది.

నిహారిక ప్రొడక్షన్ హౌస్ సక్సెస్

Raakaasaa: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అలాగే మెగా డాటర్స్ సైతం ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు కుమార్తె నిహారిక(Niharika) యాంకర్ గా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన నిహారిక తన మొదటి సినిమాగా కమిటీ కుర్రోళ్ళు సినిమాని నిర్మించి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడమే కాకుండా ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. కమిటీ కుర్రోలు సినిమా మంచి సక్సెస్ కావడంతో నిహారిక తన నిర్మాణ సంస్థ నుంచి రెండో సినిమాని కూడా ప్రకటించారు .ప్రముఖ నటుడు సంతోష్ శోభన్ (Santosh Sobhan)హీరోగా మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయాన్ సరిక సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది .ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

రాకాస సినిమా వివరాలు

ఈ సినిమాకు “రాకాస” (Raakaasa)అనే టైటిల్ పెట్టినట్లు తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాకు కాస్త విభిన్నమైన టైటిల్ పెట్టారనే చెప్పాలి ..ఈ టైటిల్ సినిమా పట్ల మంచి ఆసక్తిని కలిగిస్తుంది. మొదటి సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్న నిహారిక తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇలా నిహారిక తన సినిమాకు సంబంధించిన అప్డేట్ వెల్లడించడంతో అభిమానులు కూడా ఈమెకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సంతోష్ శోభన్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాంటసీ సినిమాగా రాకాస ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిహారిక రెండో సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారో వేచి చూడాలి. ఇలా మెగా కాంపౌండ్ నుంచి నిహారిక ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు మరియు మెగా డాటర్ సుస్మిత కొణిదెల కూడా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈమె తన మొదటి సినిమాతో ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన

మొదటి సినిమా విజయంతో నిహారిక రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ‘రాకాస’ చిత్రం 2026 ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫాంటసీ కామెడీ నిహారికకు మరో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.