|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!

Published: 08-02-2026, 1:05 PM
నిఖిల్ 'స్వయంభు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!
  • నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’!
  • ఫిబ్రవరి 11న స్వయంభు టీజర్ విడుదల!
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న చిత్రం!
  • ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్!

నిఖిల్ హీరోగా వస్తున్న ‘స్వయంభు’ సినిమా టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరి 11న టీజర్ విడుదల!

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్.. ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న స్వయంభు టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్ కానున్న అప్డేట్ ఇచ్చారు. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నిఖిల్ యాక్షన్ లుక్ అదిరిపోయింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. స్వయంభు నిఖిల్ కెరియర్‌లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ వున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కాగా.. స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

నిఖిల్ కెరీర్ బెస్ట్ మూవీ!

పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్ధం!

స్వయంభు టీజర్ విడుదల దగ్గర పడుతున్న వేళ.. అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.