
📌 Key Points
- బాల నటుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
- ‘ఓడిన వాడు చెప్పే కథ ఇది…’ అంటూ సాగే టీజర్ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.
- రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 2న గ్రాండ్ గా విడుదల కానుంది.
- ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నీలకంఠ’లో ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉందని హింట్ ఇచ్చారు.
బాల నటుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ టీజర్ విడుదలైంది. ‘ఓడిన వాడు చెప్పే కథ ఇది’ అంటూ టీజర్ ఆసక్తిని రేపుతోంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరి 2న విడుదల కానుంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి.
‘నీలకంఠ’ టీజర్ హైలైట్స్: ఆకట్టుకుంటున్న డైలాగులు!
Nilakanta Teaser : టాలీవుడ్ లో మరో యంగ్ హీరో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటిదాకా బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అతను, ఇప్పుడు హీరోగా మారి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, చకచకా సినిమాను పూర్తి చేయడమే కాదు, డైరెక్ట్ గా టీజర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు మహేంద్రన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీలకంఠ’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మరి టీజర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం పదండి.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ‘నీలకంఠ’ సినిమాలో యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే స్నేహ ఉల్లాల్ అతిథిగా కన్పించబోతోంది. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసులు, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జనవరి 2 గ్రాండ్ గా రిలీజ్ కానుంది. న్యూ ఇయర్ కానుకగా మూవీ రిలీజ్ ను పెట్టుకున్న నేపథ్యంలో ‘నీలకంఠ’ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు చిత్రబృందం. అందులో భాగంగానే టీజర్ ను వదిలారు. టీజర్ లో హీరో చెప్పే డైలాగులు “ఓడిన వాడు చెప్పే కథ ఇది… భుజాలపై తప్పు చేశాడనే భారం ఉన్నప్పుడు చేతిలో ఎన్ని కప్పులు ఉన్నా కనబడవు, వీడేంట్రా గెలిచినా ఏడుస్తాడు..” అనేవి ఆసక్తికరంగా ఉన్నాయి, శ్రవణ్ డీవోపీ, ప్రశాంత్ బిజె మ్యూజిక్, ప్రోడక్షన్ వాల్యూస్ హైలెట్ గా అన్పిస్తున్నాయి.
బాల నటుడి నుండి హీరోగా మహేంద్రన్ ప్రస్థానం
ఇక టీజర్లో రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను క్యారెక్టర్లు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో కన్పిస్తున్నారు. అలాగే టీజర్లో చూస్తుంటే సినిమా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు అన్పిస్తోంది. అంతేకాదు ఇందులో ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉందని హింట్ ఇచ్చాడు మేకర్స్. టీజర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ‘నీలకంఠ’కు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
కాగా మాస్టర్ మహేంద్రన్ బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ముఖమే. ‘పెద్దరాయుడు’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. రీసెంట్ గా విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో యంగ్ విజయ్ సేతుపతిగా ఆకట్టుకున్నాడు మహేంద్రన్. ఇక ఇప్పుడు మహేంద్రన్ హీరోగా ‘నీలకంఠ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. మరి ఆయన కెరీర్ టాలీవుడ్ లో ఎలా సాగుతుందో వెయిట్ అండ్ సీ.
క్రైమ్ థ్రిల్లర్ గా ‘నీలకంఠ’: విడుదల ఎప్పుడంటే?
Read Also : తనూజాకు కాబోయే వాడు కళ్లముందే… బాబోయ్ ఇంత ఓపెన్ గా చెప్పేశాడేంటి ఇమ్మూ భయ్యా?
‘నీలకంఠ’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. బాల నటుడు మహేంద్రన్ హీరోగా కెరీర్ ఎలా ఉంటుందో, జనవరి 2న విడుదల కానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


