
నిన్ను కోరి సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్‌లో, శ్రుతి, కామాక్షి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. శ్యామలకు కొరియర్ రావడంతో, జగదీశ్వరి ద్వారా శాలిని నిజ స్వరూపం బయటపడుతుంది. క్రాంతి కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు.
Key Points
శ్రుతి, శ్యామలకు స్నాక్స్ ఇస్తుంది, కామాక్షి టెన్షన్ పడుతుంది.
జగదీశ్వరికి శాలిని కొరియర్ ద్వారా నిజ స్వరూపం తెలుస్తుంది.
క్రాంతి, శాలిని తప్పులను జగదీశ్వరికి వెల్లడిస్తాడు.
విడాకుల గురించి క్రాంతి మరియు జగదీశ్వరి మధ్య తీవ్రమైన వాదన.
శ్రుతి యొక్క ప్రణాళిక
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్యామలకు స్నాక్స్ ఇస్తుంది శ్రుతి. టైమ్ అవుతుందని కామాక్షి టెన్షన్ పడుతుంది. ఇంతలో కొరియర్ అని వస్తుంది. శ్రుతిని శ్యామల చూడమంటుంది. కామాక్షి వెళ్తే.. శ్రుతి ఆపుతుంది. ఇది చాలా దూరం వెళ్తుందే అని కామాక్షి అంటే.. నాకు జరిగిన అవమానానికి జరగాల్సిందే. నా మీద ఒట్టే నువ్ వస్తే అని శ్రుతి అంటుంది.
ఎవరు పలక్కపోవడంతో శ్యామల వెళ్తుంది. కానీ, ఇంతలో చంద్రకళ వచ్చి తీసుకుంటానంటుంది. కానీ, శ్యామలకు కొబ్బరి పెంకులు గుచ్చడంతో చంద్రకళ వెనక్కి వస్తుంది. ఆ పెంకులు బయట పడేయమని చంద్రకళను పంపించిన శ్యామల కొరియర్ తీసుకోడానికి వెళ్తుంది. కానీ, ఇంతలో జగదీశ్వరి వచ్చి శ్యామలను ఏదో చూడమంటుంది.
అలా ట్విస్టుల మీద ట్విస్టులు అయ్యాక జగదీశ్వరి వెళ్లి కొరియర్ తీసుకుంటుంది. శాలిని కోసం కొరియర్ వచ్చిందని అది ఓపెన్ చేసి చూస్తుంది జగదీశ్వరి. అంతా అయిపోయింది అని చేతులెత్తేస్తుంది కామాక్షి. జగదీశ్వరిని శ్యామల ఏంటది అని అడిగితే.. ఏదో ఇన్సూరెన్స్‌ది అని అబద్ధం చెబుతుంది. శ్యామల వెళ్లిపోయాకా శాలిని అని గట్టిగా అరుస్తుంది జగదీశ్వరి.
శాలిని నిజ స్వరూపం బయటపడటం
శాలిని స్నానం చేస్తుందని క్రాంతి వచ్చి చెబుతాడు. నాతో రారా అని తీసుకెళ్తుంది జగదీశ్వరి. ఇప్పుడు ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. అది పెద్దమ్మ చూస్తే ఇంకా బాగుంటుంది అని పిలుచుకుంటూ వెళ్తుంది శ్రుతి. క్రాంతిని విడాకుల గురించి నిలదీస్తుంది జగదీశ్వరి. గురువు గారితో మాట్లాడింది అత్తయ్యకు చెప్పవ అని శ్యామలతో శ్రుతి అని పంపిస్తుంది.
మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటీ. నా మీద ఒట్టే చెప్పకుంటే అని ఒట్టు వేసుకుంటుంది జగదీశ్వరి. శ్యామల వెళ్లకుండా కామాక్షి ఆపుతుంది. శాలిని చాలా పెద్ద తప్పు చేసింది అమ్మా. అంతా చెబుతాను. నా డిజైన్స్ వేరే వాళ్లకు అమ్మింది శాలినినే. చంద్ర వదిన ఐడియా ఇచ్చిందని అలా చేసిందని జరిగింది అంతా చెబుతాడు క్రాంతి. జగదీశ్వరికి శాలిని నిజ స్వరూపం తెలుస్తుంది.
చంద్ర వదిన నీకు చెప్పకుండా ఆపింది. శాలినికి ఇంకో ఛాన్స్ ఇవ్వమని చెప్పింది. శాలిని మారినట్లే అనిపిస్తుంది. నాకు ఆ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు నా మనసులో విడాకుల ఆలోచన లేదు. నాన్నకు ఎవరికి తెలియకుండా చేసింది అని క్రాంతి అంటాడు. మరోవైపు చంద్రకళకు కాల్ చేసి ఓ ఫైల్ తీసుకురమ్మని విరాట్ చెబుతాడు. కామాక్షి, శ్రుతి మాట్లాడుకునేది చంద్రకళ వింటుంది.
జగదీశ్వరి, క్రాంతి మధ్య వాదన
శాలిని డివోర్స్ గురించి తెలిసేలా చేసినట్లు శ్రుతి అంటుంది. పాత సినిమాల్లో కమెడియన్ విలన్‌గా మారినట్లు ఇలా అయ్యావేంటే అని కామాక్షి భయపడుతుంది. వెంటనే అత్తయ్యను ఆపాలి అని చంద్రకళ వెళ్లిపోతుంది. మరోవైపు శాలినిని క్షమించే సమస్య లేదు. తనను అనంది నాకు మనశ్శాంతి లేదు. శాలిని చేసింది మోసం అని జగదీశ్వరి అంటుంది.
ఇంతలో చంద్రకళ వస్తుంది. రావమ్మా పెద్దమనిషి. నువ్ తప్పును దాచావ్ అని జగదీశ్వరి అంటుంది. నేను బంధాలు నిలబెట్టాలని చూశాను. మావయ్య ముందు శాలినిని నిలబెట్టగలరా. శాలిని తప్పు వెనుక కారణం నేను. ప్రేమ ఉంది కాబట్టే క్షమించమని అడిగింది.
శాలినికి మారే అవకాశం ఇవ్వండి అని చంద్రకళ అంటుంది. కానీ, జగదీశ్వరి వినదు. శాలినిని పిలిపిస్తుంది. శాలిని రాగానే లాగి కొడుతుంది అత్త జగదీశ్వరి. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, శాలిని నిజ స్వరూపం బయటపడి, కుటుంబంలో తీవ్రమైన సంఘర్షణలు చోటుచేసుకుంటాయి. విడాకుల ఆలోచనలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎపిసోడ్‌ను ఉత్కంఠభరితంగా ముగించాయి.


