
నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో విరాట్ హిప్నటైజ్ ప్లాన్‌ను శాలిని చాకచక్యంగా తిప్పికొడుతుంది. విరాట్‌పై క్రాంతి తిరగబడేలా శాలిని పెద్ద ఝలక్ ఇస్తుంది. మరోవైపు చంద్రకళ హోమం విజయవంతం అవ్వగా, రాజ్-శృతిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Key Points
విరాట్ హిప్నటైజ్ ప్లాన్‌ను శాలిని తెలివిగా ఎదుర్కొని విఫలం చేసింది.
శాలిని ప్లాన్‌తో క్రాంతికి విరాట్‌పై అనుమానం కలిగేలా చేసింది.
చంద్రకళ చేసిన హోమం విజయవంతమై స్వామిజీ భస్మం ప్రసాదించాడు.
రాజ్, శృతి బైక్‌పై రొమాంటిక్‌గా ప్రయాణిస్తూ గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకున్నారు.
హిప్నటైజ్ ప్లాన్‌కు శాలిని చెక్
నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో శాలినిని హిప్నటైజ్ చేయించిన విరాట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. విరాట్ ప్లాన్ ముందే తెలిసిన శాలిని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. విరాట్‌పై క్రాంతి తిరగబడేలా శాలిని ఝలక్ ఇస్తుంది. చంద్రకళ చేసిన హోమం సక్సెస్ అవుతుంది. అందులో నుంచి భస్మం ఇస్తాడు స్వామిజీ.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినిని హిప్లటైజే చేయిస్తాడు విరాట్. కానీ, శాలిని అందులో అబద్దం చెబుతుంది. మరోవైపు గుడిలో హోమం చేయిస్తుంది చంద్రకళ. ఈ హోమం నీ అంతరాత్మకే పరీక్ష. నీ ఉద్దేశం సరైనది కాకపోతే నువ్వు ఎంత నిష్టగా పూచ చేసిన దాని త్యాగఫలం దక్కదు అని స్వామిజీ అంటాడు.
ఈ పూర్ణాహుతి అగ్నిలో వేస్తే అగ్ని చల్లారిపోతే నీ కోరిక స్వచ్ఛమైనది కాదు అని అర్థం. ఎగసి పడిందంటే ఆ దేవుడు నీ పూజను సంతోషంగా అందుకుని నిన్ను కరుణాస్తాడని చెప్పినట్లు అని ఆ పూర్ణాహుతి చంద్రకు ఇస్తాడు స్వామిజీ. పూర్ణాహుతి అగ్నిలో వేయగానే మరింత మండుతుంది. దాంతో చంద్రకళ సంతోషిస్తుంది. మరోవైపు హిప్నటైజ్‌తో నిజం చెబుతారు అంటారు. మరి శాలిని అబద్ధం చెప్పిందేంటీ అని విరాట్ ఆలోచిస్తాడు.
విరాట్‌కు శాలిని పెద్ద ఝలక్
సైకియాట్రిస్ట్ డాక్టర్‌కు కాల్ చేసి క్రాంతిని రమ్మని చెబుతాడు. దాంతో క్రాంతి వస్తాడు. శాలినికి మెలకువ వస్తుంది. వాష్ రూమ్‌లోకి వెళ్లి చెవిలో ఉన్న దూది తీస్తుంది. డాక్టర్‌తో విరాట్ మాట్లాడటం శాలిని విన్నది గుర్తు చేసుకుంటుంది. డాక్టర్‌తో హిప్నటైజ్ గురించి అడుగుతాడు. అదంతా శాలిని వింటుంది. దాంతో ముందుగానే ప్లాన్ తెలుసుకున్న శాలిని చెవిలో దూది పెట్టుకుంటుంది.
శాలినికి మెడిసిన్ రాస్తుంది డాక్టర్. విరాట్‌ను క్రాంతికి చూపిస్తుంది. బావగారు ఇక్కడ ఎందుకు ఉన్నారు. సైకిటార్టిస్ట్‌ను ఎందుకు కలిశారు అని క్రాంతికి అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది శాలిని. సైకియార్టిస్ట్ క్రాంతి వాళ్లను చూసి షాక్ అయి వెళ్లిపోతాడు. ఆయనేంటీ అలా రియాక్ట్ అయ్యారంటుంది శాలిని . క్రాంతి వెళ్లి సైకియాట్రిస్ట్‌ను నిలదీస్తాడు.
చంద్రకళ హోమం విజయం – భస్మం లభ్యం
అక్కడ విరాట్ రాసి ఉన్న ప్రశ్నలు చూపిస్తుంది శాలిని. దాంతో సైకియార్టిస్ట్‌ను వరాట్ విరాట్ చేసింది అంతా చెబుతాడు. ఈరోజు అన్నయ్య సంగతి తేలుస్తాను అని క్రాంతి అంటాడు. మరోవైపు రాజ్ బైక్‌పై వస్తే కారు ఎక్కడ అని అడుగుతుంది శ్రుతి. బైక్ అయితే రొమాంటిక్‌గా ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్‌కు గిఫ్ట్ ఇస్తుంది శ్రుతి. గోల్డ్ రింగ్ అనుకుని చూసిన రాజ్ చూస్తే కీ చైన్ ఉంటుంది.
దాంతో విరాట్ అవును చేయించానని ఒప్పుకుంటాడు. నిన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉందని క్రాంతి అంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో శాలిని తెలివైన ఎత్తుగడలు, చంద్రకళ భక్తి, రాజ్-శృతిల ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలుపులతో సాగిన ఈ భాగం తదుపరి పరిణామాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.


