|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిత్యామీనన్ సంచలనం: నిర్మాతగా అవతారం! ఆ పేరు వెనుక ఇంత కథ ఉందా?

Published: 18-02-2026, 7:05 AM
నిత్యామీనన్ సంచలనం: నిర్మాతగా అవతారం! ఆ పేరు వెనుక ఇంత కథ ఉందా?
  • నిర్మాతగా మారిన నిత్యామీనన్, ‘కేయూరీ ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం.
  • కథ బలం ఉన్న చిత్రాలనే నిర్మిస్తామని నిత్యామీనన్ ప్రకటన.
  • ‘కేయూరీ’ అంటే భూమిలో పుట్టి కాంతిని ప్రేమించేది అని నిత్యామీనన్ వెల్లడి.
  • గతంలో కాదలిక్క నేరమిల్లై వంటి విభిన్న చిత్రాల్లో నటించిన నిత్యామీనన్.

ప్రముఖ నటి నిత్యామీనన్ నిర్మాతగా మారడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె ‘కేయూరీ ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి, కథాబలం ఉన్న చిత్రాలను నిర్మిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా తన సంస్థ పేరు వెనుక ఉన్న అర్థాన్ని కూడా ఆమె వివరించారు.

నిర్మాతగా నిత్యామీనన్ అడుగులు

Nithya Menon: ప్రస్తుత కాలంలో హీరోలే కాదు హీరోయిన్లు కూడా నిర్మాతలుగా కొత్త అడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు తమ నటనతో , గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా లాభపడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు యాడ్స్ చేస్తూ బిజీగా మారిన ఈ హీరోయిన్స్.. మరొకవైపు బిజినెస్ లు కూడా ప్రారంభిస్తున్నారు. పలు ఐకానిక్ ఉత్పత్తులను అమ్ముతూ.. అటు బిజినెస్ ఉమెన్ గా కూడా నిరూపించుకుంటున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు నిర్మాతలుగా మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తన అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ్ అంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న నిత్యామీనన్.. తాజాగా తన నటనను కొనసాగిస్తూనే మరొకవైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తన నిర్మాణ సంస్థను ప్రకటిస్తూ ఆ సంస్థకు పెట్టిన పేరు అర్థం కూడా అందరికీ చెప్పి ఆశ్చర్యపరిచింది. మరి నిత్యామీనన్ స్థాపించిన ఆ నిర్మాణ సంస్థకు పెట్టిన పేరేంటి? దాని వెనుక ఉన్న కథ ఏంటో ? ఇప్పుడు చూద్దాం..

నేషనల్ అవార్డు గ్రహీతగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న నిత్యామీనన్ తన సినీ ప్రయాణంలో మరో ముందడుగు వేసింది. అందులో భాగంగానే గత ఏడాది కాదలిక్క నేరమిల్లై, తలైవన్ తలైవి , ఇడ్లీ కడై వంటి మూడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. తాజాగా నిర్మాతగా మారి కొత్త బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగానే “కేయూరీ ప్రొడక్షన్స్” అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నిత్యామీనన్.

కేయూరీ ప్రొడక్షన్స్ వెనుక ఉన్న ఉద్దేశం

ఇకపోతే ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్మాణ సంస్థ వెనుక ఉన్న ఉద్దేశాలను వివరించింది.”కేవలం వ్యాపార లాభాల కోసం మాత్రమే కాదు.. కథ బలం ఉన్న సినిమాలు, లోతైన పాత్రలు, సమాజంపై ముద్ర వేస్తున్న కథలకు మా బ్యానర్ ప్రాధాన్యతనిస్తోంది. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. అది ప్రేక్షకుల హృదయాలకు చేరి భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించాలి. అందుకే మేము ఈ నిర్మాణ సంస్థను స్థాపించాం ” అంటూ తెలిపింది.

ఇకపోతే తన నిర్మాణ సంస్థకు కేయూరీ అని పెట్టడంతో అసలు ఈ పదం పెట్టడం వెనుక కారణం ఏంటి ? అని అభిమానులు కూడా ప్రశ్నిస్తుండగా.. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కేయూరీ అంటే భూమి లోపల పుట్టి, రాతితో చెక్కబడి కాంతిని ప్రేమించడం. అయితే కేయూరీ అనే పదానికి సంస్కృతంలో మూలం ఉంది. కేయూరం అంటే చేతికి ధరించే ఒక అలంకారం. దానికి స్త్రీ లింగ రూపమే కేయూరి. శోభ , అందం, విలువ అనే భావాలను ఇది సూచిస్తుంది. తన నిర్మాణ సంస్థకు ఈ పేరు పెట్టడం ద్వారా నిత్య మంచి కథలు, భావోద్వేగాలతో మెరిసే సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తన లక్ష్యాన్ని సూచిస్తున్నట్లు సినీవర్గాలు కూడా భావిస్తున్నాయి. మొత్తానికైతే వ్యాపార ఆలోచనలు చేయకుండా సమాజం పై ప్రభావం చూపించే కథలను తెరపైకి తీసుకురావాలన్న ఆమె నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే నిత్యామీనన్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నిత్యామీనన్ సినీ ప్రయాణం

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

మొత్తానికి నిత్యామీనన్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తడం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. కేయూరీ ప్రొడక్షన్స్ ద్వారా ఆమె ఎలాంటి చిత్రాలను అందిస్తారో వేచి చూడాలి. ఆమె ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.