
ఇంట్లో ఎవరు నిత్య పూజ చేయాలి? భార్యనా? భర్తనా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. ఈ కథనం ద్వారా పూజల ప్రాముఖ్యత, ఫలితాల గురించి తెలుసుకుందాం.
Key Points
నిత్యపూజ ఎవరు చేయాలి అనేది చాలా మందికి తెలియని విషయం.
ఇంటికి దీపం ఇల్లాలే అయినా, దీపారాధన భర్త చేయడం శుభప్రదం.
భర్త చేసే పూజల ఫలితం కుటుంబ సభ్యులందరికీ ఉంటుంది.
ఆవు నేతితో దీపారాధన చేయడం శుభకార్యాలకు దోహదపడుతుంది.
ఇంటిలో నిత్య పూజ ఎవరు చేయాలి?
ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి స్నానం చేసి, పూజగది శుభ్రం చేసుకుని, వంట చేసి, పూజ చేసుకుని మహానైవేద్యం పెట్టుకోవడం… ఇలా ఎవరికి నచ్చిన పద్ధతిని వాళ్లు పాటిస్తూ ఉంటారు. కానీ చాలా మంది తెలియక చేసే పొరపాటు ఇది.
చాలా మందికి ఈ సమాధానం తెలియదు. ఎక్కువగా ఇళ్లల్లో స్త్రీ పూజ చేస్తూ ఉంటుంది, పురుషులు పూజ చెయ్యరు. అయితే, నిజానికి ఎవరు పూజ చేయాలి? ఎవరు చేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి కి దీపం ఇల్లాలు అని చాలా మంది ఇళ్లల్లో స్త్రీలే పూజ చేస్తారు. కానీ నిజానికి ప్రతి రోజు పూజ చేయాల్సింది భర్త. ఇంటికి దీపం ఇల్లాలైనా దీపాన్ని పురుషుడు వెలిగించాలి. పూజా సంకల్పంలో కూడా ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని ఎక్కడా లేదు. అంటే నిజానికి ఇంట్లో పూజ చేయాల్సింది భర్త (యజమాని). భర్త పూజ చేస్తే ఆ ఫలితం కుటుంబ సభ్యులందరికీ వస్తుంది.
భర్త, భార్య పూజల ఫలితాలు
కానీ భార్య పూజ చేస్తే మాత్రం ఆ ఫలితం ఇంట్లో అందరికీ రాదు. ఇంట్లో మగవాళ్లు చేసే పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇలా ఏం చేసినా సరే ఇంట్లో అందరికీ పుణ్యం దక్కుతుంది. కానీ స్త్రీ చేసే వ్రతాలు, నోములకు కేవలం స్త్రీకి మాత్రమే పుణ్యం కలుగుతుంది, పురుషుడికి ఆ ఫలితం దక్కదు.
భర్త పూజ చేసినప్పుడు స్త్రీలు నైవేద్యం వండడం, పూలను అలంకరించడం, పూజ సామాగ్రిని సిద్ధం చేయడం వంటివి చేయొచ్చు. ఎప్పటి నుంచో మీ ఇంట్లో కూడా ఆడవారే పూజలు చేస్తున్నట్లయితే, ఫలితాన్ని కుటుంబ సభ్యులందరికీ అందించడానికి భర్తలు పూజించడం మంచిది.
ఇంట్లో శుభకార్యాలు దిగ్విజయంగా జరగాలంటే ఈ పరిహారం పాటించండి:
శుభకార్యాల కోసం పరిహారం
ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నిత్యపూజ చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా ప్రతి రోజూ ఆవు నేతితో దీపారాధన చేయడం మంచిది. ఇలా చేస్తే శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి కూడా.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇంటిలో శాంతి, శుభం కోసం నిత్య పూజకు ప్రాముఖ్యత ఉంది. భర్త చేసే పూజల వల్ల కుటుంబానికి మంచి ఫలితాలు వస్తాయి. ఆవు నేతి దీపారాధన కూడా శుభప్రదం.


