|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nitya Shetty : ఇస్రోలో ఆఫర్.. ఇన్ఫోసిస్ లో జాబ్.. అన్ని వదిలేసి సినిమాల్లోకి.. దేవుళ్ళు పాప బ్యాక్ గ్రౌండ్..

Published: 02-06-2025, 6:05 AM
Nitya Shetty : ఇస్రోలో ఆఫర్.. ఇన్ఫోసిస్ లో జాబ్.. అన్ని వదిలేసి సినిమాల్లోకి.. దేవుళ్ళు పాప బ్యాక్ గ్రౌండ్..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించి, ఇస్రో, ఇన్ఫోసిస్ ఉద్యోగాలను వదులుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిత్యా శెట్టి జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది. తన విజయగాథను ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

Key Points

1

ఇస్రో ఆఫర్‌ను తిరస్కరించి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది.

2

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది.

4

చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డులు అందుకున్న నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తోంది.

ఇస్రో ఆఫర్ నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగం వరకు

Nitya Shetty : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఇప్పుడు నటీనటులు అవుతున్న సంగతి తెలిసిందే. దేవుళ్ళుతో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది నిత్యా శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డులు అందుకున్న ఈ పాప కరోనా ముందు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే సినిమాల కంటే ముందు నిత్యా శెట్టి జాబ్ కూడా చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి తన చదువు, జాబ్స్ వివరాలు తెలిపింది.

సినిమాలపై ఆసక్తి మరియు ఉద్యోగం నుండి రాజీనామా

నిత్యా శెట్టి మాట్లాడుతూ.. మొదట డాక్టర్ అవుదామనుకున్నాను కానీ మా చుట్టాల్లో ఒకరు డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ చదవాలి అని చెప్పడంతో డాక్టర్ వదిలేసా. బిటెక్ లో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ చేశాను. అప్పట్లో యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు. బిటెక్ తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. మైసూర్ వెళ్లి ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను. మధ్యలో ఇస్రో ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను. ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఇస్రో వద్దనుకుని ఇన్ఫోసిస్ లోనే ఉండిపోయాను.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు

ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీ అవార్డులు కూడా తీసుకున్నా. అక్కడ ఆఫీస్ లో నా చుట్టూ ఉండేవాళ్ళు సినిమాలు చేసుకోవచ్చు కదా, నువ్ ట్రై చేస్తే వస్తాయి కదా, నువ్వు ఒకప్పుడు ఆర్టిస్ట్ కదా అని బ్రెయిన్ వాష్ చేయడంతో నేను ఆలోంచించడం మొదలుపెట్టా. సినిమాల్లోకి వెళ్దాం అనుకోని ఫిక్స్ అయ్యాక జాబ్ రిజైన్ చేశాను. ఆన్ సైట్ పంపిస్తాను అన్నారు అయినా జాబ్ రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను అని తెలిపింది.

తన కెరీర్‌లోని వినూత్నమైన మలుపులతో నిత్యా శెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె ధైర్యం, నిర్ణయం చాలా మందికి ఆదర్శంగా ఉంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.