|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ ‘డ్రాగన్’: ఓటీటీ డీల్ కుదిరినట్టేనా? రికార్డు ధర పలికిన మూవీ రైట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 10-02-2026, 2:05 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్': ఓటీటీ డీల్ కుదిరినట్టేనా? రికార్డు ధర పలికిన మూవీ రైట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ జోర్డాన్ లో జరుగుతోంది, భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ!
  • మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు, ఎన్టీఆర్ తో సీన్స్ అదిరిపోతాయట!
  • నెట్ ఫ్లిక్స్ వారు ‘డ్రాగన్’ మూవీ ఓటీటీ హక్కులను ఏకంగా 145 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం!
  • 1970ల బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథతో రూపొందుతున్న ‘డ్రాగన్’, ఎన్టీఆర్ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పూనకాలే! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ ఓటీటీ డీల్ ఒక రేంజ్ లో జరిగిందట. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు చూద్దాం.

145 కోట్ల రూపాయల ఓటీటీ డీల్?

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే పేరుని అనుకుంటున్నారట. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జోర్దన్‌లో జరుగుతుంది. భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. ఇందులో మలయాళ నటుడు టొవినో థామస్‌ కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఆయన ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరి మధ్య కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారట.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యిందట. రికార్డు ధరకి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏకంగా రూ.145కోట్లకు డీల్‌ కుదిరిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ మూవీ కావడంతో మార్కెట్‌ పరంగా భారీ క్రేజ్‌ ఉంది. పైగా ఇలాంటి యాక్షన్‌ చిత్రాలను ఓటీటీలో బాగా చూస్తారు. అందుకే నెట్‌ ఫ్లిక్స్ భారీ స్థాయిలో ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఇందులో నిజం ఎంతా అనేది క్లారిటీ లేదు.

బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్స్ తో డ్రాగన్

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ నటిస్తున్న `డ్రాగన్‌` మూవీకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఎపిసోడ్లు ఉంటాయట. సాధారణంగా ప్రశాంత్‌ నీల్ మూవీలు డార్క్ గా ఉంటాయి. బ్లాన్‌ టోన్‌ ఉంటుంది. `కేజీఎఫ్‌`, `సలార్‌` చిత్రాల్లో అది చూడొచ్చు. ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల చేసినప్పుడు కూడా అదే టోన్‌ మెయింటేన్‌ చేశారు. దీంతో ఈ మూవీ కూడా బ్లాక్‌ అండ్‌ వైట్‌ టోన్‌ ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఎన్టీఆర్‌ లుక్‌ కూడా మారిపోయింది. ఆ మధ్య మరీ బక్కగా కనిపించారు. ఫేస్‌లో గ్లో లేదు, అనారోగ్యానికి గురైనప్పుడు ఎలా ఉంటారో అలా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా మారిపోయారు. మోస్ట్ స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు చాలా పవర్‌ఫుల్‌గానూ కనిపిస్తున్నారు. లేటెస్ట్ ఎయిర్‌పోర్ట్ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంది. అది సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

గ్యాంగ్‌ స్టర్‌ కథతో ప్రశాంత్ నీల్

ఇక `డ్రాగన్‌` చిత్రాన్ని గ్యాంగ్‌ స్టర్‌ కథతో రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. 1970 బెంగాల్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో మాఫియా లీడర్‌గా ఎన్టీఆర్‌ కనిపిస్తారని సమాచారం. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనీల్‌ కపూర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగిటివ్‌ రోల్‌ అని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం.

మొత్తానికి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. దీని గురించిన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.