
📌 Key Points
- NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ డ్రామా.. రఫ్ లుక్‌లో తారక్!
- మార్చి ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ మరియు యాక్షన్ సీన్ షూట్!
- తారక్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిపేందుకు నీల్ ప్లాన్!
- రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్ ఓ రేంజ్‌లో ఉండనుందని టాక్!
మాస్ కాంబోతో వస్తున్న NTRNeel మూవీ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
NTR, ప్రశాంత్ నీల్ కాంబో.. రికార్డులు బ్రేక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘NTRNeel’. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో తారక్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా రఫ్ అండ్ రగ్గడ్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఓ స్పెషల్ మూవీగా నిలవనుందని అభిమానుల్లో ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతున్నది.
మార్చి ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ షూట్ చేయన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిపేందుకు నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. అందుకే స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రతి సీన్ ఆచి తూచి చేస్తుండగా.. రామోజీ ఫిలిమ్ సిటీలో జరగబోయే యాక్షన్ సీన్ కూడా ఓ రేంజ్‌లో ఉండనుందని టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అప్డేట్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్స్ అదుర్స్!
తారక్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందా?
NTRNeel సినిమా షూటింగ్ అప్డేట్స్‌తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


