|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, పాత బైక్ లో తిరుగుతూ.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అన్నారో తెలుసా

Published: 06-11-2025, 11:35 AM
రాజమౌళి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, పాత బైక్ లో తిరుగుతూ.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అన్నారో తెలుసా

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమా శిఖరాగ్రాన ఉన్నారు. అయితే ఆయన ప్రస్థానం అంత సులువు కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ రాజమౌళి పడ్డ కష్టాలను, ఒత్తిళ్లను ఎలా వివరించారో, ఆయన విజయాల వెనుక ఉన్న శ్రమను ఈ కథనంలో చూద్దాం.

Key Points

1

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాలో శిఖరాగ్రాన ఉన్నా, ఆయన విజయం వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది.

2

ఎన్టీఆర్ ప్రకారం, స్టూడెంట్ నెంబర్ 1 సమయంలో రాజమౌళి పాత యమహా బైక్‌పై తిరుగుతూ పడిన కష్టాన్ని చూశారు.

4

బాహుబలి 1 మొదట 40 కోట్లకు పైగా డెఫిసిట్‌లో విడుదలైందని, రాజమౌళి అప్పులు కట్టారని ప్రభాస్ తెలిపారు.

ఎన్టీఆర్ కళ్ళారా చూసిన రాజమౌళి కష్టం

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమా శిఖరాగ్రాన ఉన్నారు. ఇండియన్ సినిమాలో ది బెస్ట్ డైరెక్టర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే రాజమౌళి సాధించిన ఈ ఘనత ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ళ కష్టం, దర్శకుడిగా ఎదగడం కోసం అనుభవించిన స్ట్రగుల్స్ ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళికి ఎక్కువ అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి.

రాజమౌళి దర్శకుడిగా పరిచయమైంది స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతోనే. ఆ మూవీ సమయంలో రాజమౌళి పడ్డ కష్టాన్ని కళ్లారా చూశానని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజమౌళి విమర్శించే అర్హత, కామెంట్స్ చేసే అర్హత ఎవరికీ లేదని తారక్ తెలిపాడు. స్టూడెంట్ నెంబర్ 1 టైంలో రాజమౌళికి పాత యమహా బైక్ ఉండేది. ఆ బైక్ లో రోజూ ఉదయాన్నే రాఘవేంద్ర రావు దగ్గరకి వెళ్లి సీన్ ఓకే చేయించుకుని, సెట్ కి వచ్చి షూట్ చేసేవారు. ఆ తర్వాత డబ్బింగ్, రీ రికార్డింగ్ ఇలా అన్ని పనులకు ఆ బైక్ లోనే తిరిగేవాడు.

సింహాద్రి విజయం వెనుక రాజమౌళి ఒత్తిడి

ఆ తర్వాత సింహాద్రి విషయంలో కూడా రాజమౌళి సుఖం లేదు. సింహాద్రి మూవీ ఇంకా రాజమౌళిపై ఒక కత్తి పెట్టినట్లు అయింది. ఎందుకంటే అంతకు ముందు ఆది సినిమాతో నాకు మంచి హిట్ వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత రాజమౌళి, నా కాంబోలో వస్తున్న మూవీ కావడంతో విపరీతంగా అంచనాలు పెరిగాయి.

దీనికి తోడు సింహాద్రి నిర్మాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి రాజమౌళిపై ఉండేది. ఆ ఒత్తిడిని రాజమౌళి మౌనంగా భరిస్తూ సినిమా షూటింగ్ చేశారు. సక్సెస్ అయ్యారు అని ఎన్టీఆర్ తెలిపారు. ఇటీవల బాహుబలి రీ రిలీజ్ సమయంలో కూడా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి తీసుకునే ఒత్తిడి గురించి తెలిపారు.

బాహుబలి లోటు, ప్రభాస్ మాటలు

బాహుబలి 1 డెఫిసిట్ లో రిలీజ్ అయింది. నిర్మాతలు పైకి 20 కోట్ల లోటు అని చెబుతున్నారు కానీ వాస్తవానికి 40 కోట్లకి పైగానే డెఫిసిట్ ఉంది. ఆయా లోటు భర్తీ కావాలి అంటే సినిమా పెద్ద విజయం సాధించాలి. కానీ ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అందరం ఆందోళన చెందాం ? నిర్మాతలు రాజమౌళిని నమ్మి సినిమా చేశారు. ఆ లోటుని భర్తీ చేయడానికి నా దగ్గర ఆస్తులు కూడా లేవు అని జక్కన్న అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి గురించి నాకు తెలుసు.. మొన్నటి వరకు అప్పులు కడుతూనే ఉన్నారు అని తెలిపారు. కానీ బాహుబలి 1 రెండవరోజు నుంచి పికప్ అయింది. భారీ విజయం సాధించింది.

రాజమౌళి విజయాలు కేవలం ప్రతిభతో వచ్చినవి కావు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అపారమైన ఒత్తిళ్లను తట్టుకొని నిలబడటం వల్లనే సాధ్యమయ్యాయి. ఈ విషయాలను ఎన్టీఆర్, ప్రభాస్ మాటల్లో వినడం ఆయన కృషికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.