|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tirupati : మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు – 27న గరుడ సేవ, వాహన సేవల వివరాలు

Published: 12-05-2026, 5:01 PM
Tirupati : మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు - 27న గరుడ సేవ, వాహన సేవల వివరాలు

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠం తిరుమలకు ముఖద్వారమైన తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మే 31 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మే 22వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ (TTD) ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత సభలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని శుద్ధి చేసే సంప్రదాయమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని మే 18న నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది.

పసుపు, కుంకుమ, గంధం, కస్తూరి, పచ్చాకు వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయ గోడలు, పైకప్పుకు ప్రోక్షణం చేస్తారు. ఈ శుద్ధి అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.