|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దండోరా మూవీకి ఎన్టీఆర్ జేజేలు! శివాజీ నటనకు ఫిదా!! వైరల్ ట్వీట్ చేసిన యంగ్ టైగర్!!!

Published: 20-01-2026, 2:30 AM
దండోరా మూవీకి ఎన్టీఆర్ జేజేలు! శివాజీ నటనకు ఫిదా!! వైరల్ ట్వీట్ చేసిన యంగ్ టైగర్!!!
  • దండోరా మూవీపై ఎన్టీఆర్ ప్రశంసలు – చిత్ర యూనిట్‌కు అభినందనలు!
  • శివాజీ, బిందు మాధవి నటనకు ఎన్టీఆర్ ఫిదా – ముఖ్య పాత్రల్లో నవదీప్, నందు!
  • మురళీకాంత్ దర్శకత్వానికి ఎన్టీఆర్ జేజేలు – బలమైన కథ, అద్భుత విజయం!
  • కుల వివక్ష అంశంపై రూపొందిన దండోరా – ప్రశంసలు కురిపించిన యంగ్ టైగర్!

టాలెంటెడ్ యాక్టర్ శివాజీ నటించిన దండోరా మూవీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం చూసిన తర్వాత ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

దండోరా మూవీపై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

టాలెంటెడ్ యాక్టర్ శివాజీ(Shivaji), బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘దండోరా’(Dandora). మురళీకాంత్(Murali Kanth) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవదీప్(Navdeep), నందు(Nandu), రవికృష్ణ(Ravi Krishna), మనికా చిక్కాల(Manika Chikkala), మౌనికా రెడ్డి(Mounika Reddy), రాధ్య(Radhya), అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

శివాజీ నటనకు ఎన్టీఆర్ ప్రశంసలు

తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశాలతో తెరకెక్కిన దండోరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా.. ‘ఇప్పుడే దండోరా (Dandora) సినిమా చూశాను. ఇది ఎంతో లోతైన, శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే చిత్రం. శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవిలు తమ నటనతో సినిమా ఆద్యంతం అద్భుతంగా రాణించారు.

మురళీకాంత్‌కు ఎన్టీఆర్ అభినందనలు

ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్. ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని ప్రోత్సహించి, నిర్మించిన రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఈ గొప్ప చిత్రంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దండోరా మూవీపై ప్రశంసలు కురిపించడంతో ఈ చిత్రం మరింత పాపులర్ అయింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.