|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR : ఖర్చు ఎక్కువ అవుతుందని.. గాయంతోనే షూటింగ్ చేసిన ఎన్టీఆర్..

Published: 24-09-2025, 12:18 AM
NTR : ఖర్చు ఎక్కువ అవుతుందని.. గాయంతోనే షూటింగ్ చేసిన ఎన్టీఆర్..

తాజాగా ఒక యాడ్ షూటింగ్ సమయంలో గాయపడిన ఎన్టీఆర్, ఖర్చులను పెరగకుండా ఆ షూటింగ్ ను పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి. నొప్పిని అనుభవిస్తూనే ఆయన పూర్తి చేసిన డెడికేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Key Points

1

గాయంతో ఉన్నా, ఖర్చు పెరగకుండా యాడ్ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.

2

డాక్టర్ల సలహాను పక్కన పెట్టి, నొప్పిని సహించి షూటింగ్ కంప్లీట్ చేశారు.

4

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు, కోలుకున్న తర్వాతే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్.

యాడ్ షూటింగ్ లో గాయం

NTR : ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాతో రాగా ఆ సినిమా ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఎన్టీఆర్ కి ఓ యాడ్ షూటింగ్ లో గాయాలు అయ్యాయి అని అతని టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.(NTR)

అయితే ఎన్టీఆర్ కి గాయం వల్ల ఆ యాడ్ షూటింగ్ మధ్యలో వదిలేయడంతో దాన్ని పూర్తిచేసేశాడట. గాయంతోనే ఇంకా పూర్తిగా తగ్గకముందే వచ్చి షూటింగ్ చేసాడట ఎన్టీఆర్.

నొప్పిని అనుభవిస్తూ షూటింగ్

ఈ యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఒక స్టూడియోలో సెట్ వేసి ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు స్టూడియోలో సెటప్ అంతా అలా ఉంచితే రెంట్ పెరుగుతుంది. టీం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, దీంతో ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆ వాణిజ్య సంస్థకు కూడా యాడ్ లేట్ అవుతుంది. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గాయం తగ్గకపోయినా ఎన్టీఆర్ షూటింగుకు వెళ్లారట. నొప్పిని భరిస్తూనే ఎన్టీఆర్ ఆ యాడ్ కంప్లీట్ చేసారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ డెడికేషన్

దీంతో ఎన్టీఆర్ డెడికేషన్, వర్క్ పట్ల కమిట్మెంట్ చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్, ఎన్టీఆర్ టీమ్, ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ యాడ్ షూట్ అయిపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాకే మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఎన్టీఆర్ యొక్క ఈ డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మరియు త్వరలోనే కోలుకుంటారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.