
📌 Key Points
- ఎస్.ఎస్.రాజమౌళి జపాన్ ఇంటర్వ్యూలో ‘డ్రాగన్’ టైటిల్‌ను వెల్లడించారు.
- ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ‘NTRNeel’ షూటింగ్ మళ్లీ మొదలవుతుంది.
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గి, రోగిలా కనిపించారని కామెంట్స్ వచ్చాయి.
- షూటింగ్ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ వేరొక సినిమా స్క్రిప్ట్‌పై పనిచేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘NTRNeel’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కానుంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత చిత్ర యూనిట్ మళ్లీ రంగంలోకి దిగడంతో ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా కిక్ ఇచ్చే వార్త.
డ్రాగన్ టైటిల్ వెనుక రాజమౌళి మాట
NTRNeel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. అయితే ఈ సినిమా పేరు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఒక జపాన్ ఇంటర్వ్యూలో తన సినిమాలకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ చెప్పేశారు. మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. అప్పటికే ఇదే టైటిల్ అనుకుంటున్నారు అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రాజమౌళి ఆ మాట చెప్పడంతో దాదాపు అందరూ అదే టైటిల్ ఫిక్స్ అయిపోయారు.
ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఒక తరుణంలో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర 2 సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. డ్రాగన్ చిత్ర యూనిట్ 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బరువు చాలా తగ్గిపోయారు. కొంతవరకు బరువు తగ్గితే బాగుంటుంది కానీ తగ్గాల్సిన దానికంటే కూడా పూర్తిగా తగ్గిపోతే రోగిలా కనిపిస్తారు.
ఆరు నెలల తర్వాత NTRNeel షూటింగ్ ప్రారంభం
ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కు అదే జరిగింది. అయితే దానికి సంబంధించి చాలా కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి. మొత్తానికి ఆరు నెలలు ఈ సినిమాకి సంబంధించి అసలు షూటింగ్ జరగలేదు. ఇప్పుడు చిత్ర యూనిట్ మళ్లీ రంగంలోకి దిగి షూటింగ్ మొదలు పెడుతుంది. ఈ ఆరు నెలల గ్యాప్ లో మరో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో పడిపోయాడు ప్రశాంత్.
మొత్తానికి ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నిటికీ సంబంధించి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. అలానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా కూడా వస్తుంది.
ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టుల అప్‌డేట్
వీటన్నిటిని మించి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మైథాలజికల్ సబ్జెక్ట్ చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ రేంజ్ కంప్లీట్ గా మారిపోతుంది అని అందరికీ ఒక అవగాహన ఉంది. ఆ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిపోయిన తర్వాత మొదలవుతుంది. ఏదేమైనా ప్రశాంత్ ప్రాజెక్టు పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వరుస మూడు డిజాస్టర్లు పడిన ప్రభాస్ కు సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వార్ సినిమాతో డిజాస్టర్ లో ఉన్న తారక్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందా? అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
ఆరు నెలల గ్యాప్ తర్వాత ‘NTRNeel’ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం, సినిమా ఆగిపోయిందన్న వార్తలకు తెరదించింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


