
NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ రెట్టింపయింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఒకరోజు ముందే అంటే మే 19 అర్ధరాత్రి 11:52 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు.
ఈ కీలక అప్‌డేట్‌కు ముందే చిత్రబృందం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో గ్లింప్స్(NtrNeel) ఏ ఏ భాషల్లో, ఏ ఏ యూట్యూబ్ ఛానల్స్‌లో స్ట్రీమింగ్ కానుందో స్పష్టంగా వివరించారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో రాబోతున్న ఈ టీజర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ప్రత్యేక వీడియోలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆయన మార్క్ అదిరిపోయే రీ-రికార్డింగ్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అదిరిపోయే మ్యూజిక్ బిట్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తూ, టీజర్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.


