
మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సైయారా సినిమా భారీ విజయం సాధించింది. అహాన్ పాండే మరియు అనీత్ పడ్డా జంట నటన ప్రేక్షకులను అలరించింది. వారి ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ చర్చనీయాంశంగా మారింది.
Key Points
సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
అహాన్ పాండే, అనీత్ పడ్డా మధ్య ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో అహాన్ అనీత్ కి ముద్దు పెట్టిన వీడియో వైరల్ గా మారింది.
అహాన్, అనీత్ డేటింగ్ వార్తలు కూడా వస్తున్నాయి.
సైయారా సినిమా విజయం
మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రికార్డు కలెక్షన్లలో దుమ్ము రేపింది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రికార్డు నెలకొల్పింది. ఈ మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ సెన్సేషన్స్ గా మారిపోయారు. సినిమాలో వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు వారి ఆఫ్-స్క్రీన్ స్నేహం కూడా ఫ్యాన్స్ ను మరింతగా ఆకర్షిస్తోంది.
సైయారా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అహాన్, అనీత్ మధ్య లవ్, కెమిస్ట్రీ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అనీత్ తలపై ముద్దు పెట్టాడు అహాన్ పాండే. వీడియోలో అనీత్ తో పాటు అక్కడున్న వాళ్లందరూ సైయారా టైటిల్ ట్రాక్ పాడుతున్నారు. అది గ్లోబల్ చార్ట్స్ లో టాప్ లో ఉంది. వారు పాట పాడుతుండగా అనీత్ ను హత్తుకుని ఆమె తలపై ముద్దు పెట్టాడు అహాన్. వీళ్లిద్దరూ రహస్యంగా కూడా మాట్లాడుకున్నారు.
వైరల్ అయిన ముద్దు వీడియో
అనీత్ తలపై అహాన్ ముద్దు పెట్టిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు నానా రకాలుగా స్పందిస్తున్నారు. ఒక అభిమాని ఎక్స్ లో లో వీడియోను పంచుకుంటూ.. “నేను ఓకే కాదు. దీన్ని తట్టుకోలేకపోతున్నా. అరుస్తున్నా, ఏడుస్తున్నా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరొకరు.. “అది చాలా అందంగా ఉంది!!!! నిజంగా మంత్రముగ్ధుడయ్యాన” అని వ్యాఖ్యానించాడు. సైయారా సినిమాలో అహాన్ పాత్ర.. అనీత్ పాత్ర తలపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయే భావోద్వేగ దృశ్యం గుర్తుకు వచ్చింది. “అహాన్ అనీత్ కి కృష్ణ కపూర్ స్టైల్ లో ముద్దు పెట్టాడు’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు.
అహాన్, అనీత్ ముంబయిలో కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. వారు కలిసి షాపింగ్ చేస్తున్నారు. ముఖం కప్పి దాక్కుంటున్నారు. అనీత్ అహాన్ తో పాటు అతని సోదరి అనన్య పాండే ఇంటికి రక్షాబంధన్ కి వెళ్ళింది.
డేటింగ్ వార్తలు
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన సైయారా భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద రొమాంటిక్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా, ఇండియాలో రూ.315 కోట్లు సంపాదించింది.
అహాన్ మరియు అనీత్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ సైయారా సినిమాకు మరింత ఆకర్షణను తీసుకువచ్చింది. వారి ఆఫ్-స్క్రీన్ జోడి ప్రేక్షకులను మెప్పిస్తోంది.


