|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అధికారిక ప్రకటన: సినిమాలకు దళపతి విజయ్ గుడ్ బై.. రాజకీయాలే ఇక ఆయన లోకం!

Published: 28-12-2025, 1:05 AM
అధికారిక ప్రకటన: సినిమాలకు దళపతి విజయ్ గుడ్ బై.. రాజకీయాలే ఇక ఆయన లోకం!
  • విజయ్ దళపతి సినిమాలకు అఫీషియల్ గా గుడ్ బై ప్రకటించారు.
  • ఆయన సొంత పార్టీని స్థాపించి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
  • ‘జననాయగన్’ విజయ్ చివరి చిత్రం, వచ్చే ఏడాది జనవరి 9న విడుదల.
  • రాజకీయాల్లో 30-35 ఏళ్లు సేవ చేయాలని దళపతి విజయ్ లక్ష్యం.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు అఫీషియల్ గా గుడ్ బై చెప్పారు. ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ సొంత పార్టీని స్థాపించారు. ‘జననాయగన్’ ఆయన చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కీలక మార్పుపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

విజయ్ దళపతి సినిమాలకు వీడ్కోలు

Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఆయన సొంత పార్టీని కూడా స్థాపించాడు.. ఇప్పటికే విజయ్ తన పార్టీ పేరును కూడా ప్రకటించాడు.. త్వరలోనే పూర్తిగా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడని తెలిసిందే. అయితే గతంలో పూర్తి చెయ్యాలని అనుకున్న సినిమా ఒకటి పెండింగ్ ఉండటంతో ఆ మూవీ తర్వాత కంప్లిట్ గా సినిమాలకు దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యాడు.. తాజాగా ఆయన అఫీషియల్ గా సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాతో పాటుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

హీరో దళపతి విజయ్‌.. కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఉన్నారు. ఇమేజ్‌ పరంగా, ఫ్యాన్‌ బేస్‌ పరంగా తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ ఎలాగో, కోలీవుడ్‌ విజయ్‌ అలాగ. రజనీ, కమల్‌ వంటి సీనియర్లని పక్కన పెడితే ఆ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నటులలో ఈయనే ముందు వరసలో ఉంటుంది. విజయ్‌ ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని, ఆయన సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్త వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన సినిమాల నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించేసాడు.. జన నాయగన్ మూవీ తర్వాత శాశ్వతంగా సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పేశాడు.. మరో 30-35 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే పార్టీని ప్రకటించిన ఆయన తన పార్టీలోకి కొత్త వాళ్లను తీసుకోబోతున్నారని సమాచారం.. ఇక సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఆయన పార్టీలో చేరెందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.. త్వరలోనే దీని గురించి తెలిసిందే అవకాశాలు ఉన్నాయి.

రాజకీయాల్లో విజయ్ భవిష్యత్ ప్రణాళికలు

చివరి చిత్రం ‘జననాయగన్’ వివరాలు

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్.. ఈ మూవీ షూటింగ్ పనులను పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంధి.. విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 3 గంటల నిడివితో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా విజయ్ ను ఈ మూవీలో చూడొచ్చునని టీజర్స్, పోస్టర్స్ ను చూస్తే అర్థం అవుతుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రాజకీయ నేపథ్యంలో ఈ పొలిటికల్ డ్రామా మూవీ వస్తుంది. ఈ మూవీలో విజయ్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. చివరి సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి…

మొత్తంగా, విజయ్ దళపతి సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలికి, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. ‘జననాయగన్’తో సినీ అభిమానులను అలరించి, ఆ తర్వాత ప్రజా సేవలో నిమగ్నమవ్వనున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.