|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్

Published: 11-06-2026, 4:31 PM
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోనుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా, మాస్ గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ సుజీత్ తప్ప ఇంకొకరు లేరు అనేది అంగీకరించాల్సిన వాస్తవం. అంతేకాకుండా, ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంతకాలం విరామం ప్రకటించడంతో, ఓజీ 2 భవిష్యత్తుపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. సినిమా వాయిదా పడుతుందా లేదా పూర్తిగా ఆగిపోతుందా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఓజీ 2 కి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. “మేము ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేస్తారు. సమయం ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేమంతా కలిసి చర్చిస్తాం” అని మేకర్స్ తమ పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సినిమా భవిష్యత్తుపై ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. ఈ ఒక్క అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులకు పట్టలేని సంతోషం కలుగుతోంది.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ చిత్రం సంచలన విజయం అందుకుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హాష్మీ కీలక పాత్రల్లో నటించారు. సుజీత్ దర్శకత్వం ఒకెత్తయితే, తమన్ సంగీతం మరో ఎత్తుగా నిలిచింది. ఓజీ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. కానీ ఇటీవల చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు కానీ తెరకెక్కించడం లేదు. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ఓజీ 2 పై అనుమానాలు పటాపంచలు చేసింది.

As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss. #OG2

— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026

దీంతో మరోసారి ఓజాస్ గంభీరా పాత్రను భారీ తెరపై చూడబోతున్నామనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఓజీ మొదటి భాగం సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ రెండో భాగం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందని తాజా అప్‌డేట్ సూచిస్తోంది. ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత జరిగే చర్చలు, అధికారిక ప్రకటనలపైనే నిలిచింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.