|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG Song : OG సాంగ్ లో ఇది గమనించారా..? దీని అర్ధం ఏంటో తెలుసా? సుజీత్ మామూలోడు కాదు..

Published: 03-08-2025, 7:48 AM
OG Song : OG సాంగ్ లో ఇది గమనించారా..? దీని అర్ధం ఏంటో తెలుసా? సుజీత్ మామూలోడు కాదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. తాజాగా విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్ లోని జపనీస్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Key Points

1

OG సినిమా ఫైర్ స్టార్మ్ సాంగ్ వైరల్ అయింది.

2

పాటలో జపనీస్ లిరిక్స్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

4

సుజీత్ క్రియేటివిటీకి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫైర్ స్టార్మ్ సాంగ్ వైరల్

OG Song : పవర్ స్టార్ పవన్ క్లయం OG సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. పవన్ ఎక్కడ కనపడినా OG OG అని అరుస్తున్నారు ఫ్యాన్స్. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ అనే సాంగ్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది.

OG సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ లిరిక్స్ లో అదిరిపోయే మ్యూజిక్ తో అందర్నీ మెప్పించింది. ఈ పాటలో పవన్ విజువల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ తో OG పై మరిన్ని అంచానాలు నెలకొన్నాయి. OG సినిమాలో జపనీస్ బ్యాక్ డ్రాప్ ఉందని ఆల్రెడీ సుజిత్ చెప్పాడు. అందుకే ఈ పాటలో కూడా జపనీస్ భాష వాడారు.

జపనీస్ లిరిక్స్ ప్రత్యేకత

అయితే పాటలో కొన్ని లిరిక్స్ కూడా జపనీస్ లో వేశారు. ఈ క్రమంలో సాంగ్ మొదట్లో వేసిన ఓ జపనీస్ పదం బాగా వైరల్ అవుతుంది. సాంగ్ లో パワースター ఈ పదం ఇప్పుడు అందర్నీ మెప్పిస్తుంది. ఇంతకీ దీని మీనింగ్ ఏంటంటే పవర్ స్టార్ అని అర్ధం. పవర్ స్టార్ కి జపనీస్ భాషలో అలా రాస్తారు. సాంగ్ లో పవర్ స్టార్ అని ఇంగ్లీష్ లో ఇచ్చే బదులు ఇలా జపనీస్ భాషలో పెట్టడంతో మరింత హైప్ నెలకొంది. సుజీత్ క్రియేటివిటీకి తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకేముంది ఫ్యాన్స్ ఇప్పటికే ఈ జపనీస్ పదాన్ని సోషల్ మీడియాలో, బయట వైరల్ చేసి ప్రింట్ చేసేస్తున్నారు.

సుజీత్ క్రియేటివిటీ

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్ విజయం సినిమా విజయానికి సంకేతంగా భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.