
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ థియేటర్లలో విడుదలైంది. సినిమాపై ట్విట్టర్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ప్రీమియర్ షోలు చూసిన వారి రివ్యూలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Key Points
పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మిలకు సాలిడ్ కమ్ బ్యాక్
ఇమ్రాన్ హష్మి విలనిజం ఆకట్టుకుంది
ట్విటర్ రివ్యూలు బ్లాక్ బస్టర్ హిట్ అని సూచిస్తున్నాయి
సౌత్ మాస్ స్వాగ్ లోడెడ్ యాక్షన్ థ్రిల్లర్
ట్విటర్‌లో ఓజీకి భారీ స్పందన
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఓజీ తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. బ్యూటిఫుల్ ప్రియాంక మోహన్ ఓజీ సినిమాలో హీరోయిన్‌గా పవన్ కల్యాణ్ సరసన యాక్ట్ చేసింది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి ఓజీ సినిమాలో విలన్‌గా చేశాడు. ఇమ్రాన్ హష్మి తెలుగు తెరకు పరిచయం అవుతున్న తొలి సినిమా ఇదే. తమన్ సంగీతం అందించిన ఓజీ సీనిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దాన్య నిర్మాతగా నిర్మించారు.
ఇక ఓజీ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో ఓజీ సినిమా రిలీజ్ కానుంది. కానీ, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి ఓజీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. అవి చూసిన నెటిజన్స్, ఆడియెన్స్ ఈ మూవీ ఎలా ఉందో ఓజీ ట్విటర్ రివ్యూ ద్వారా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మి నటనపై అభిప్రాయాలు
“ఓజీ ఇన్‌సైడర్స్ రివ్యూ.. ఫస్టాఫ్‌లో డీసెంట్‌గా స్టార్ట్ అయిన సినిమా ఇంటర్వెల్‌కు హై ఇస్తుంది. సెకండాఫ్‌లో 3 మాస్ హై సీన్స్‌తోపాటు వాషి ఓ వాషి మేనియా ఉంటుంది. విలన్‌గా ఇమ్రాన్ హష్మి జీవించేశాడు. ఫైనల్‌గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. సౌత్ మాస్ స్వాగ్ లోడెడ్. ఆంధ్ర, తెలంగాణ ఫైర్‌స్టోమ్‌రా బాబు” అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.
“సెన్సార్ బోర్డ్ నుంచి దే కాల్ హిమ్ ఓజీ ఫస్ట్ రివ్యూ. పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మి సాలిడ్ కమ్‌బ్యాక్. కచ్చితంగా చూడండి. 2025లోనే పవర్ ప్యాక్డ్ బ్లడీ బెస్ట్ థ్రిల్లర్. పవన్ కల్యాణ్ తిరిగి రఫ్పాడించాడు. దీన్ని సాలిడ్ కమ్‌బ్యాక్ అంటారు. కానీ.. కానీ.. ఇమ్రాన్ హష్మి షో మొత్తం దోచేశాడు. టెర్రిఫిక్‌గా కనిపించాడు. స్వాగ్, క్రేజీ డైలాగ్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే” అని పవన్ కల్యాణ్ కంటే ఇమ్రాన్ హష్మి మార్కులు కొట్టేసినట్లుగా ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఓజీపై రివ్యూ ఇచ్చాడు.
ఇంకా ఉమైర్ సంధు చెబుతూ” ఇక చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాను కచ్చితంగా చూసేలా చేసే పాయంట్. కచ్చితంగా చూడండి. మజా వస్తుంది. పైసా వసూల్ ఫిల్మ్” 5కి 3.5 రేటింగ్ ఇచ్చాడు.
విలన్‌గా ఇమ్రాన్ హష్మి ప్రదర్శన
“దే కాల్ హిమ్ ఓజీ ఇన్‌సైడర్స్ రివ్యూ : ఈ సినిమా గురించి చెబితే బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న పదం అవుతుంది. ఐదుకు 4 రేటింగ్. ఇకనుంచి నాన్ ఓజీ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. డెత్ కోటా కన్ఫర్మ్ అంటా” అని మరొకరు చెప్పారు.
ఇలా ఇప్పటివరకు అయితే ఓజీ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్‌గానే రివ్యూస్ వచ్చాయి. పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మి ఇద్దరికి సాలిడ్ కమ్‌బ్యాక్ అని చెబుతున్నారు. పవన్ కంటే ఇమ్రాన్ విలనిజం కాస్తా మార్కులు ఎక్కువ కొట్టేసినట్లుగా క్రిటిక్ ఉమైర్ సంధు రాసుకురావడం గమనార్హం.
మొత్తం మీద, ఓజీ సినిమాపై ట్విట్టర్‌లో చాలా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ మరియు ఇమ్రాన్ హష్మిల నటనతో పాటు, సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


